iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై క్లారిటీ!

  • Author ajaykrishna Published - 09:26 AM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 09:26 AM, Wed - 2 August 23
ఎట్టకేలకు ప్రభాస్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ పై క్లారిటీ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతినిండా బిగ్గెస్ట్ మూవీస్ తో పాన్ వరల్డ్ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద డార్లింగ్ ఇంపాక్ట్ ఏమాత్రం తగ్గలేదు. ఏ సినిమా చేసినా మినిమమ్ రూ. వంద కోట్ల ఓపెనింగ్స్ గ్యారంటీ. బాహుబలిలా నెక్స్ట్ లెవెల్ లో సినిమాని ప్రమోట్ చేస్తే.. ఇంకా ఎక్కువే రావచ్చు. అయితే.. బాహుబలి తర్వాత అన్ని డిఫరెంట్ స్టోరీస్ ట్రై చేస్తున్నాడు ప్రభాస్. కథ నచ్చితే పెద్దగా అనుభవం లేని డైరెక్టర్స్ ని కూడా ఓకే చేస్తున్నాడు.

అలాంటిది సూపర్ ఫామ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో ఓ సినిమా ఓకే చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్లే ముందు.. ప్రభాస్ ప్రస్తుతం కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ‘సలార్’ మూవీ రెడీ చేశాడు. సెప్టెంబర్ 28న సలార్ పాన్ ఇండియా రేంజ్ లో.. వివిధ భాషలలో రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియాని షేక్ చేసిన కేజీఎఫ్ సిరీస్ కి కొనసాగింపుగా సలార్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కేజీఎఫ్ 2కి మించి అంచనాలు సలార్ పై సెట్ అయ్యాయి. మేకర్స్ ప్రమోషన్స్ కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారు. ఇది కాకుండా ప్రభాస్.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో ‘కల్కి 2898AD’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ జానర్ ఆ సినిమా పాన్ వరల్డ్ ని ఊపేయనుంది. ఆల్రెడీ టీజర్ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో చూశాం.

ఇదిలా ఉండగా.. సలార్, కల్కి సినిమాలే కాకుండా మారుతీతో ఒకటి, సందీప్ రెడ్డితో స్పిరిట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయినా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొత్త కథలు వింటున్నాడట డార్లింగ్. తాజా సమాచారం ప్రకారం.. కొన్నాళ్ళుగా వినిపిస్తున్న కాంబినేషన్ సెట్ అవుతుందని పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో లాంటి క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశాడు లోకేష్ కనగరాజ్. ఇతని సినిమాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే.. కొంతకాలంగా ప్రభాస్ తో లోకేష్ సినిమా ఉంటుందని అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా ప్రభాస్ తో సినిమా ఉంటుంది.. కానీ టైమ్ పడుతుందని ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. సో.. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసిందని మైత్రి మూవీ మేకర్స్ అంటున్నారట. ఎందుకంటే.. సిద్ధార్థ్ ఆనంద్ – ప్రభాస్ కాంబోలో మైత్రి బిగ్ మూవీ ప్లాన్ చేసింది. కానీ.. అది సెట్ అవ్వకపోవడంతో ఇప్పుడు లోకేష్ తో ప్లాన్ చేశారని సమాచారం. ఏదైతేనేం ఫ్యాన్స్ కోరుకున్న కాంబో సెట్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ప్రభాస్ – లోకేష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet