Somesekhar
Game Changer Latest Update: గేమ్ ఛేంజర్ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఓ వైపు సంతోషంగా ఉన్నాప్పటికీ.. మరోవైపు టెన్షన్ లో ఉన్నారు. మరి చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం ఏంటి?
Game Changer Latest Update: గేమ్ ఛేంజర్ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఓ వైపు సంతోషంగా ఉన్నాప్పటికీ.. మరోవైపు టెన్షన్ లో ఉన్నారు. మరి చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం ఏంటి?
Somesekhar
‘గేమ్ ఛేంజర్’.. డైరెక్టర్ శంకర్-గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కుతున్న మూవీ. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల కాబోతోందని ధనుష్ రాయన్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో దిల్ రాజు ప్రకటించాడు. దాంతో డిసెంబర్ వార్ మరింత ఆసక్తికరంగా మారింది. ఇక గేమ్ ఛేంజర్ మూవీ గురించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ క్రేజీ అప్డేట్ తో ఫ్యాన్స్ ఓ వైపు సంతోషంగా ఉన్నాప్పటికీ.. మరోవైపు టెన్షన్ లో ఉన్నారు. మరి చరణ్ ఫ్యాన్స్ టెన్షన్ కు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గేమ్ ఛేంజర్ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదల అవుతుందని దిల్ రాజు ప్రకటించడంతో.. మెగా ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ సాలిడ్ అప్టేడ్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించాడు. అయితే ఈ అప్డేట్ తో సంతోషపడాలో లేక ఆందోళన చెందాలో అర్ధం కావట్లేదు ఫ్యాన్స్ కు. అసలు విషయం ఏంటంటే? ఈ మూవీలో ఏడు పాటలు ఉంటాయని తమన్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే ‘జరగండి జరగండి’ పాట రిలీజ్ చేశారు మేకర్స్. దానికి మాస్ ఆడియెన్స్ లో అద్భుతమైన స్పందన వచ్చింది.
ఈ క్రమంలోనే ఇంకో పాటను రిలీజ్ చేయనున్నట్లు తమన్ అప్డేట్ ఇచ్చాడు. మరోసాంగ్ లీక్ కాకముందే రిలీజ్ చేద్దామనుకుంటున్నాం అని చెప్పేశాడు. అలాగే ఇందులో ఏడు సాంగ్స్ ఉంటాయన్న విషయం కూడా రివీల్ చేశాడు. దాంతో చరణ్ ఫ్యాన్స్ లో టెన్షన్ మెుదలైంది. ఏడు పాటలు అంటే సినిమా నిడివి కూడా ఎక్కువే ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. ఇన్ని పాటలు ప్రేక్షకులకు బోర్ కొట్టించవా? దీని ప్రభావం మూవీ రిజల్ట్ పై ఉంటుందని వారు ఆందోళన పడుతున్నారు. ఆగస్ట్ నుంచి అప్డేట్స్ ప్లాన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాడు తమన్. అయితే ఏ పాటను రిలీజ్ చేయాలన్నది మాత్రం ఇంకా అనుకోలేదని పేర్కొన్నాడు. మరి తమన్ సాంగ్స్ వస్తున్నాయని చెప్పినందుకు సంతోషపడాలో.. లేక 7 పాటలు ఉన్నాయని బాధపడాలో మెగా ఫ్యాన్స్ కు అర్ధం కావడం లేదు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.