iDreamPost
android-app
ios-app

Pushpa 2 Record: విడుదలకు ముందే పుష్ప 2 క్రేజీ రికార్డు! ఆ లిస్ట్ లో టాప్..

  • Published Jul 24, 2024 | 10:42 AM Updated Updated Jul 24, 2024 | 10:42 AM

రిలీజ్ కు ముందే పలు రికార్డులు బద్దలు కొడుతూ.. భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

రిలీజ్ కు ముందే పలు రికార్డులు బద్దలు కొడుతూ.. భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 24, 2024 | 10:42 AMUpdated Jul 24, 2024 | 10:42 AM
Pushpa 2 Record: విడుదలకు ముందే పుష్ప 2 క్రేజీ రికార్డు! ఆ లిస్ట్ లో టాప్..

పుష్ప 2.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న చిత్రం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా 30 రోజుల దాకా బ్యాలెన్స్ ఉందని సమాచారం. దాంతో అనుకున్న టైమ్ కు అంటే డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుందా? రాదా? అన్న సందేహం ఫ్యాన్స్ లో నెలకొంది. అయితే ఈ డౌట్ పై మేకర్స్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటుగా విడుదలకు ముందే పుష్ప 2 క్రేజీ రికార్డును నెలకొల్పింది. ఆ లిస్ట్ లో టాప్ లో నిలిచి ఔరా అనిపించింది.

రిలీజ్ కు ముందే పలు రికార్డులు బద్దలు కొడుతూ.. భారీ హైప్ ను క్రియేట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ IMDB 2024లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలతో పాటుగా.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే సినిమాల లిస్ట్ ను ప్రకటించింది. జనవరి నుంచి జులై 10 వరకు ఉన్న డేటా ఆధారంగా ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీగా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నిలవగా.. ఆ తర్వాత మంజుమ్మల్ బాయ్స్, ఫైటర్, హనుమాన్, షైతాన్ మూవీలు నిలిచాయి.

Pushpa2

ఇదిలా ఉండగా.. ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే చిత్రాల జాబితాలో బన్నీ పుష్ప 2 టాప్ ప్లేస్ లో నిలిచింది. దాంతో ఓ క్రేజీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఐకాన్ స్టార్. ఇక లిస్ట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ సెకండ్ ప్లేస్ లో నిలవగా.. ఆ తర్వాత స్థానాల్లో వెల్కం టు ద జంగిల్, గోట్, కంగువ చిత్రాలు నిలిచాయి. దీంతో పాటుగా డిసెంబర్ 6నే ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఇందులో తగ్గేదేలేదని మేకర్స్ ప్రకటించారు. మరి విడుదలకు ముందే రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ