iDreamPost
android-app
ios-app

తెలుగబ్బాయితో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్‌!

అల్లు అరవింద్‌ గతంలో లావణ్య త్రిపాఠితోనూ ఇలానే అన్నారు. ఆమె ఏకంగా నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మృణాల్‌ విషయంలోనూ

అల్లు అరవింద్‌ గతంలో లావణ్య త్రిపాఠితోనూ ఇలానే అన్నారు. ఆమె ఏకంగా నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మృణాల్‌ విషయంలోనూ

తెలుగబ్బాయితో పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్‌!

ప్రముఖ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ పెళ్లిపై గత కొద్దిరోజులనుంచి మీడియాలో.. సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన సైమా అవార్డ్సు ఫంక్షన్‌లో మృణాల్‌ పెళ్లిపై అల్లు అరవింద్‌ చేసిన కామెంట్లు ఈ వార్తలకు తెర తీశాయి. సైమా అవార్డ్స్‌ ఈవెంట్‌లో అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ‘‘  నేను ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఓ మంచి హైదరాబాద్‌ అబ్బాయిని చూసుకోవాలి( పెళ్లి అన్న ఉద్దేశం వచ్చేలా ). హైదరాబాద్‌కు వచ్చేయాలి. నేను నిన్ను దీవిస్తున్నాను’’ అని అన్నారు.

అల్లు అరవింద్‌ గతంలో లావణ్య త్రిపాఠితోనూ ఇలానే అన్నారు. ఆమె ఏకంగా నాగబాబు కుమారుడు వరుణ్‌ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మృణాల్‌ విషయంలోనూ ఆయన ఇలానే అన్నారు. దీంతో మృణాల్‌ కూడా త్వరలో ఓ తెలుగింటి కోడలు కాబోతోందన్న ప్రచారం మొదలైంది. అయితే, ఈ వార్తలపై తాజాగా మృణాల్‌ ఠాకూర్‌ స్పందించారు. ఆమె మాట్లాడుతూ… తెలుగబ్బాయితో పెళ్లిపై డిజైనర్లు, స్టైలిస్ట్‌లు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు తనకు పదే పదే ఫోన్‌ చేస్తున్నారని అన్నారు.

పెళ్లి గురించి అడుగుతున్నారని చెప్పారు. తెలుగబ్బాయితో పెళ్లికి రెడీ అయ్యావట కదా అంటూ ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ‘ నేను కూడా అదే అడుగుతున్నా.. ఇంతకీ ఆ తెలుగబ్బాయి ఎవరో నాకు చెప్పండి’ అని అన్నారు. తనకు పెళ్లి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ వార్తలు చదివి తాను నవ్వు కున్నానని అన్నారు. ఓ అబ్బాయిని చూసిపెట్టి.. పెళ్లి వేదిక సిద్ధం చేస్తే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పారు. మరి, తెలుగబ్బాయితో పెళ్లి వార్తలపై మృణాల్‌ క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.