iDreamPost
android-app
ios-app

Double Ismart-Mr. Bachchan: ఫేవర్ అంతా బచ్చన్ కే ఉన్నా.. భయపెడుతున్న ఇస్మార్ట్!

  • Published Aug 06, 2024 | 3:01 PM Updated Updated Aug 06, 2024 | 3:01 PM

మిస్టర్ బచ్చన్ తో రవితేజ, డబుల్ ఇస్మార్ట్ తో రామ్ పోతినేని ఆగస్ట్ 15న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి.

మిస్టర్ బచ్చన్ తో రవితేజ, డబుల్ ఇస్మార్ట్ తో రామ్ పోతినేని ఆగస్ట్ 15న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం పదండి.

  • Published Aug 06, 2024 | 3:01 PMUpdated Aug 06, 2024 | 3:01 PM
Double Ismart-Mr. Bachchan: ఫేవర్ అంతా బచ్చన్ కే ఉన్నా.. భయపెడుతున్న ఇస్మార్ట్!

టాలీవుడ్ లో ఈ ఆగస్ట్ 15న జెండా పండుగతో పాటుగా సినిమా పండుగ కూడా మెుదలౌవ్వబోతోంది. ఈ ఒక్కరోజే దాదాపు 5 సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి థియేటర్లలోకి వస్తున్నాయి. ఇక ఇందులో ప్రధానంగా పోటీ రెండు సినిమాల మధ్యే ఉంది. అవే రవితేజ-హరీష్ శంకర్ ల ‘మిస్టర్ బచ్చన్’, పూరి-రామ్ ల ‘డబుల్ ఇస్మార్ట్’. మిగతా సినిమాలు కూడా మంచి బజ్ నే క్రియేట్ చేసుకున్నాయి. వాటిని మించి ఈ రెండు చిత్రాలు భారీ అంచనాలతో బరిలోకి దిగబోతున్నాయి. ఇక ఫేవర్ మెుత్తం మిస్టర్ బచ్చన్ కే ఉన్నా.. డబుల్ ఇస్మార్ట్ ఒక పక్క భయపెడుతోంది అంటున్నారు సినీ పండితులు. ఈ నేపథ్యంలో ఈ సినిమాల గురించి ఓసారి పూర్తి విశ్లేషణ చేద్దాం.

మిస్టర్ బచ్చన్.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో వస్తోన్న మూవీ కావడంతో సహజంగానే దీనిపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో మెుదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడాలేని క్యూరియాసిటి ఏర్పడింది. అందుకు తగ్గట్లుగానే ఫేవర్ మెుత్తం మిస్టర్ బచ్చన్ సినిమాకే ఉందన్నది సినీ విశ్లేషకుల మాట. మరి ఆ ఫేవర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మిస్టర్ బచ్చన్ కు కంటెంట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే? ఈ కథ ఆల్రెడీ హిట్టు కొట్టిందే. పైగా రీమేక్స్ ను డీల్ చేయడంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ది అందెవేసిన చేయి. ఇక ప్రమోషన్స్, స్టార్ క్యాస్టింగ్ తో ప్రేక్షకుల అటెన్షన్ ను ఎప్పుడో డ్రా చేశారు మేకర్స్. ఇదంతా ఒకెత్తు అయితే మాస్ మహారాజా ఒకెత్తు. లాంగ్ వీకెండ్ లో అలరించడానికి రెడీగా ఉన్నాడు రవితేజ. ఆయన మూవీస్ లో ఎంటర్ టైన్ మెంట్ కు కొదవ ఉండదు. ఇప్పటికే విడుదలైన  సాంగ్స్  కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలియనిది కాదు. అదీకాక హీరోయిన్ గ్లామర్ సినిమాకు స్పెషల్ ఎంట్రాక్షన్ కాబోతోంది. ఇక యునిక్ ప్రమోషన్స్ తో బచ్చన్ దూసుకెళ్తున్నాడు. ఇలా మిస్టర్ బచ్చన్ కు ఎలా చూసిన ఫేవర్ ఎక్కువగానే ఉంది.

Ismart vs Bachan

కాగా.. డబుల్ ఇస్మార్ట్ విషయానికి వస్తే.. పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ.. అభిమానులను అలరిస్తాడనే గట్టి నమ్మకం ఉంది. ప్రమోషన్స్ విషయంలో ఇంకా స్పీడ్ పెంచలేదు పూరి గ్యాంగ్. అయితే ఒక్కసారి బరిలోకి దిగితే మాత్రం పూరి ప్రమోషన్స్ మామూలుగా ఉండవు. మార్ ముంతా సాంగ్ చాట్ బస్టర్ గా నిలిచింది. పైగా ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. అదీకాక డబుల్ ఇస్మార్ట్ పక్కా మాస్ మూవీ. ఇలాంటి చిత్రాలను తీయడంలో పూరి జగన్నాథ్ సిద్ధహస్తుడని ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పుకోనవసరం లేదు. ఆ విషయం ఇండస్ట్రీ రికార్డులకు తెలుసు. బొమ్మ బాగుంటే చాలు.. ఈ డాషింగ్ డైరెక్టర్ సినిమాల్లో లాజిక్స్ పట్టించుకోకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు ప్రేక్షకులు. మెుత్తంగా చూసుకుంటే పై విషయాల్లో ఫేవర్ మిస్టర్ బచ్చన్ కే కాస్త ఎక్కువ కనిపిస్తున్నప్పటికీ.. ఇస్మార్ట్ శంకర్ ని తక్కువ అంచనావేయకూడదు. లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతున్న ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవాలని కోరుకుందాం.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş