iDreamPost
android-app
ios-app

VS13: విశ్వక్ సేన్ జోరు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్!

  • Published Aug 06, 2024 | 1:45 PM Updated Updated Aug 06, 2024 | 1:45 PM

మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. అందరికి షాకిచ్చాడు విశ్వక్ సేన్. VS13 సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. అందరికి షాకిచ్చాడు విశ్వక్ సేన్. VS13 సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Published Aug 06, 2024 | 1:45 PMUpdated Aug 06, 2024 | 1:45 PM
VS13: విశ్వక్ సేన్ జోరు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్!

విశ్వక్ సేన్.. ఎలాంటి మూవీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు. తన యాక్టింగ్, యాటిట్యూడ్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ పరిశ్రమలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లు పట్టాలు ఎక్కిస్తూ.. అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి.. అందరికి షాకిచ్చాడు. VS13 సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విశ్వక్ సేన్ మంచి జోరుమీదున్నాడు. వరుసగా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. దీంతో పాటుగా ‘లైలా’ అనే ఇంట్రెస్టింగ్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు విశ్వక్. ఇందులో లేడీ గెటప్ లో కనిపించబోతున్నట్లు పోస్టర్ లోనే తెలిసిపోయింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ సంబంధించి పోస్టర్ ను షేర్ చేశాడు మాస్ హీరో. VS13 వర్కింగ్ టైటిల్ తో ఓ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

VS13 సినిమాకు శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యానర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విశ్వక్ పోలీస్ గా కనిపించబోతున్నట్లు అర్ధం అవుతోంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మరి జోరు చూపిస్తూ.. వరుసగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio