ట్రోల్ చేసే వాళ్లు టెర్రరిస్టులతో సమానం.. DGPకి ‘మా’ ఫిర్యాదు

MAA.. సోషల్ మీడియాలో ఆర్టిస్టులపై వల్గర్ కామెంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నారు.

MAA.. సోషల్ మీడియాలో ఆర్టిస్టులపై వల్గర్ కామెంట్స్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇచ్చినట్లుగానే ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వస్తున్నారు.

రాను రాను సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్ల చర్యలు హద్దులు దాటేస్తున్నాయి. కొందరిని లేదా కొన్ని వీడియోలను టార్గెట్ చేస్తూ వల్గర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా తెలుగు యూట్యూబర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రణీత్ హనుమంత్ వెకిలి వ్యాఖ్యలు వార్తల్లో నిలవడమే కాదు.. జైలు పాలయ్యాడు. ఈ ఘటన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఫైర్ అయ్యాడు. అలాగే సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన వీడియోలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు వచ్చాయంటూ పేర్కొన్నాడు  విష్ణు. ఈ వీడియో వచ్చిన 48 గంటల్లోగా ట్రోలింగ్ వీడియోలు, వ్యాఖ్యలను తొలగించాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. లేకుంటే యూట్యూబ్‌కు ఫిర్యాదు చేస్తామని, కఠిన చర్యలు ఉంటాయని, సైబర్ సెక్యూరిటీకి కంప్లయింట్ చేస్తామని చెప్పారు.

చెప్పినట్లుగానే 48 గంటలు గడవగానే ఐదు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులు తెలిపారు. తాజాగా తెలంగాణ డీజీపీకి మా అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అసోసియేన్ సభ్యులైన శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటులు శివకృష్ణలు డీజీపీని కలిసి.. సోషల్ మీడియాలో నటీనటులపై వస్తున్న ట్రోల్సింగ్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఫీమేల్ ఆర్టిస్టులపై వస్తున్నట్రోల్ చాలా దారుణంగా ఉన్నాయని, ట్రోల్ చేసే వాళ్ళు టెర్రరిస్టులతో సమానమని పేర్కొన్నారు. ఇలా అసభ్యకర వీడియోలు చేస్తున్న ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని కోరారు. ఇప్పటికే ఈ ఐదు చాన్నళ్లపై చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్న మా అసోసియేషన్ సభ్యులు.. ఆ కాపీని కూడా డీజీపీకి అందజేశారు.

ఇప్పటి వరకు 25 యూట్యూబ్ ఛానళ్ళను టెర్మినేట్ చేశామని ఈ సందర్భంగా డీజీపీ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ విషయాన్ని మీడియాకు వెళ్లడించారు మా ప్రతినిధులు. మా అసోసియేషన్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ టీమ్ పెట్టుకున్నామని, త్వరలో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌‌తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామని కూడా వెల్లడించారు ప్రతినిధులు. ఈ ట్రోలింగ్ వల్ల చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, క్యారెక్టర్ అసాషినేషన్ చేస్తూ.. పైశాచికత్వం పొందుతున్నారని అన్నారు. వీటికి ఎండ్ కార్ట్ వేసేందుకు డీజీపీని కలిసినట్లు వెల్లడించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 200పైగా ట్రోలింగ్ ఛానల్స్ గుర్తించామని, వాటిల్లో 25 ఛానల్స్ డౌన్ చేశామన్నారు. మీరు కూడా అందులో ఉంటే ఆ లింక్‌లు తీసి వెయ్యండని హితవు పలికారు.

Show comments