నవీన్ పొలిశెట్టి.. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఆడియెన్స్‌ను తన వైపునకు తిప్పుకున్న నటుడు. సినిమాల్లో వచ్చేందుకు ఎంతో కష్టపడిన నవీన్.. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో చిన్న రోల్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘డీ ఫర్ దోపిడీ’, ‘వన్: నేనొక్కడినే’ లాంటి మూవీస్‌లో యాక్ట్ చేసినా అంతగా పేరు సంపాదించలేదు. అయితే ఆయన నటించిన ‘ఏఐబీ హానెస్ట్ వెడ్డింగ్’, ‘వాట్ ఈజ్ యువర్ స్టేటస్’ లాంటి టెలివిజన్ షోలు యూట్యూబ్‌లో ఫుల్ పాపులర్ అయ్యాయి. దీంతో వచ్చిన ఫేమ్‌తో ఎట్టకేలకు హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కించుకున్నారు నవీన్.
2019 సంవత్సరం నవీన్ పొలిశెట్టి లైఫ్‌ను పూర్తిగా మార్చేసింది. ఆ ఏడాది ఆయన యాక్ట్ చేసిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో పాటు ‘చిచ్చోరే’ చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ రెండూ సూపర్ హిట్ అవ్వడంతో ఇటు తెలుగుతో పాటు అటు హిందీలోనూ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు నవీన్. ఆ తర్వాత నటించిన ‘జాతిరత్నాలు’ సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించారాయన. జోగిపేట్ శ్రీకాంత్‌గా పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో ఆడియెన్స్‌ను కడుపుబ్బా నవ్వించారు నవీన్. అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఏకంగా స్టార్ హీరోయిన్ అనుష్కతో నటించే ఛాన్స్‌ను దక్కించుకున్నారు.
నవీన్-అనుష్క కాంబోలో తెరకెక్కుతున్న మూవీనే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. కానీ పలు కారణాల వల్ల ఈ ఫిల్మ్ విడుదల ఆలస్యమవుతూ వస్తోంది. మూవీపై పెద్ద బజ్ కూడా ఏర్పడలేదు. టీజర్ వచ్చేంత వరకు ఈ సినిమా ఉందనే విషయం మూవీ గోయర్స్‌కు కూడా తెలీదు. టీజర్ కూడా ఆహో ఓహో అనేంత రేంజ్లో లేదు. దీంతో ఇన్ని అడ్డంకుల మధ్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తవకపోవడమే రిలీజ్ వాయిదాకు కారణమని ప్రకటనలో తెలిపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ని ముందుగా ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఒక నోట్‌ను పోస్ట్ చేశారు. ఈ సినిమాలో నవీన్ స్టాండప్ కమెడియన్ పాత్రలో కనిపించగా.. అనుష్క చెఫ్ పాత్రను పోషించారు.
We apologize from the bottom of our hearts for this unforeseen delays.
We will soon be serving #MissShettyMrPolishetty, a comedic feast, with a side of laughter…
Stay tuned for the New release date and trailer… pic.twitter.com/LpMbdrVTsm
— UV Creations (@UV_Creations) July 29, 2023