iDreamPost
android-app
ios-app

‘మత్తు వదలరా 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు!

  • Published Sep 08, 2024 | 12:17 PM Updated Updated Sep 08, 2024 | 1:21 PM

Mathu Vadalara 2 Movie Trailer Out: చిన్న చిత్రంగా విడుదలైన ‘మత్తు వదలరా’ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ ఊహించని రీతిలో అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ‘మత్తు వదలరా 2’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

Mathu Vadalara 2 Movie Trailer Out: చిన్న చిత్రంగా విడుదలైన ‘మత్తు వదలరా’ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ క్రైమ్ కామెడీ మూవీ ఊహించని రీతిలో అద్భుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ వచ్చేస్తోంది. ‘మత్తు వదలరా 2’ మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.

  • Published Sep 08, 2024 | 12:17 PMUpdated Sep 08, 2024 | 1:21 PM
‘మత్తు వదలరా 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు!

పెద్ద సినిమాలకే కాదు.. మంచి విజయం సాధించిన పలు చిన్న చిత్రాలకు కూడా సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆడియెన్స్​ను అలరించేందుకు వస్తోంది ‘మత్తు వదలరా 2’. ఫస్ట్ పార్ట్ బ్లాక్​బస్టర్​గా నిలవడంతో రెండో పార్ట్​ మీద కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. స్వర మాంత్రికుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీ సింహా, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీని రితేశ్ రానా డైరెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఈ ఫిల్మ్ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. ఫుల్ కామెడీ, యాక్షన్ ప్యాక్డ్​గా ఉన్న ఈ ట్రైలర్ ఎంటర్​టైనింగ్​గా సాగుతూ ఆడియెన్స్​ను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సత్య పండించిన కామెడీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది.

‘మత్తు వదలరా 2’ ట్రైలర్ ఆసాంతం ఫన్నీగా అలరిస్తోంది. 2 నిమిషాల 13 సెకన్ల ఈ ట్రైలర్ ఆద్యంతం కడుపుబ్బా నవ్విస్తోంది. ట్రైలర్ నిండా అదిరిపోయే పంచులు, ఫన్నీ డైలాగ్స్​తో నింపేశారు మేకర్స్. ‘హీ’ టీమ్ ఏజెంట్లుగా ఉన్న శ్రీ సింహా, సత్య అనుకోని సమస్యలో ఇరుక్కోవడం? అనేది ఇందులో ఇంట్రెస్టింగ్​గా చూపించారు. పోలీసు ఆఫీసర్ అయిన సునీల్.. శ్రీ సింహా, సత్యను హంతకులుగా భావించడం, వారిని పట్టుకునేందుకు ప్రయత్నించడం.. మరో ఏజెంట్ అయిన ఫరియా ఆ ఇద్దరికీ సాయం చేయడం అంతా ఎంటర్​టైనింగ్​గా ప్రెజెంట్ చేశారు. ‘మత్తు వదలరా’కు సీక్వెల్ పూర్తి వైవిధ్యంగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. సెకండ్ పార్ట్​ను హిలేరియస్ ఎంటర్​టైనర్​గా మలచినట్లు అనిపిస్తోంది. కామెడీతో పాటు ఇందులో యాక్షన్ పాళ్లు కూడా పుష్కలంగా ఉండటంతో ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్​పీరియెన్స్​ ఖాయంగా కనిపిస్తోంది.

ఇక, టీజర్, ట్రైలర్స్​తో అందరి అటెన్షన్​ను తమ వైపునకు తిప్పుకుంటున్న ‘మత్తు వదలరా 2’ ఈ నెలలోనే రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 13న మూవీని గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నారు. విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడంతో ప్రమోషనల్ కంటెంట్​ను వరుసగా రిలీజ్ చేస్తూ పోతోంది మూవీ టీమ్. వీటి ద్వారా ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. తాజాగా వచ్చిన ట్రైలర్​లో కామెడీ డోస్ డబుల్​గా ఉండటంతో హైప్ మరింత పెరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇక, ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉన్నారు. శ్రీ సింహా, సత్య, ఫరియాతో పాటు వెన్నెల కిషోర్, సునీల్, అజయ్, రోహిణి, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీకి కీరవాణి మరో తనయుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. క్లాప్ ఎంటర్​టైన్​మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్​ను మించిన సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి. మరి.. ‘మత్తు వదలరా 2’ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.