iDreamPost
android-app
ios-app

బాక్సాఫీస్‌ వద్ద కుమ్మేస్తున్న విజయ్..ది గోట్ డే3 కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?

  • Published Sep 08, 2024 | 12:54 PM Updated Updated Sep 08, 2024 | 4:25 PM

The Goat Day 3 Collections: తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన లేటెస్ట్‌ మూవీ ది గోట్‌. అయితే ఈ మూవీ డే3 కలెక్షన్స్‌ జోరు అన‍్యుహంగా పెరిగింది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

The Goat Day 3 Collections: తమిళ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి నటించిన లేటెస్ట్‌ మూవీ ది గోట్‌. అయితే ఈ మూవీ డే3 కలెక్షన్స్‌ జోరు అన‍్యుహంగా పెరిగింది. మరీ ఆ వివరాలేంటో చూద్దాం.

  • Published Sep 08, 2024 | 12:54 PMUpdated Sep 08, 2024 | 4:25 PM
బాక్సాఫీస్‌ వద్ద కుమ్మేస్తున్న విజయ్..ది గోట్ డే3 కలెక్షన్స్‌ ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ దళపతి, మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటించన లేటెస్ట్‌ మూవీ ‘ది గోట్‌’. ఈ సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించారు. అయితే  గోట్‌ మూవీ విజయ్‌ కెరీర్‌ లో తెరకెక్కిన 68వ సినమా అని తెలిసిందే. ఇకపోతే ఫ్యామిలీ అండ్ యాక్షన్ రూపొదించిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ ఈ ప్టెంబర్ 5న విడుదలైన మిక్స్‌ డు టాక్‌ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే.. మొదటి రోజే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ. రూ.43 కోట్లకు పైగా నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన విషయం తెలిసిందే. ఇక రెండవరోజు కాస్త పర్వాలేదు అనిపించిన మూడవ రోజు మాత్రం కలెక్షన్స్‌ జోరు అన‍్యుహంగా పెరిగింది. ఆ వివరాలేంటో చూద్దాం.

విజయ్‌ ది గోట్‌ మూవీ తమిళ నాడులోడీసెంట్ టాక్ వచ్చినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్లాప్ టాక్ మాత్రమే సొంతం చేసుకుందనే చెప్పవచ్చు.  ఈ క్రమంలోనే.. ది గోట్‌ చిత్రంకు రెండవ రోజు తమిళనాడులో  రూ.25 కోట్ల వసూలు చేయగా, తెలుగులో మాత్రం రూ.1.5 కోట్ల వసూళ్లు నమోదైంది.  ఇలా ఓవరీస్‌ లో  2వ రోజున ఈ సినిమా ఇండియాలో రూ.25 కోట్లు నికర వసూళ్లను కలెక్ట్ చేసింది. అదే వరల్డ్‌ వైడ్‌ గా చూసుకుంటే.. 50 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. అయితే మూడవ రోజు గోట్‌ మూవీ కలెక్షన్స్‌ విషయానికొస్తే.. వినాయక చవితి పండుగ పైగా, వీకెండ్‌ అడ్వాంటేజ్ ప్లస్‌ అవ్వడంతో.. అన్ని చోట్లా కలెక్షన్స్‌ పరంగా జోరు పెరిగింది. దీంతో శనివారం గోట్‌ మూవీ మూడవ రోజు కలెక్షన్స్‌ తమిళనాడులో రూ.30 కోట్లు వసూళ్లు చేయగా, హిందీలో రూ. 2.15 కోట్లు, తెలుగులో రూ. 2 కోట్లు, కేరళలో రూ.1 కోటి,  కర్ణాటకలో రూ.3 కలెక్షన్స్‌ వసూలు చేసింది. దీంతో ఈ సినిమా ఇండియాలో మూడవ రోజు రూ.38.5 కలెక్టు చేసింది. ఇక ఓవర్సీస్‌లో  ది గోట్ సినిమా భారీ వసూళ్లను రాబడుతుంది.

ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడాలో గోట్‌ విజయ్‌ గోట్‌ మూవీ రికార్డు వసూళ్లు నమోదు చేసింది. ఈ సినిమా మూడో రోజు అక్కడ 475 లోకేషన్లలో 900‌K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 3 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా.. ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లో రూ.225 కోట్లకుపైగా వసూళ్లు సాధించిదని తెలిపాయి. అలాగే 4వ రోజుకు రూ.300 కోట్ల క్లబ్‌ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. మరీ, విజయ్‌ ది గోట్‌ మూవీ 3డే కలెక్షన్స్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio