iDreamPost
android-app
ios-app

అందరి ముందు హీరోయిన్​కు ముద్దు పెట్టిన డైరెక్టర్.. వైరల్ వీడియో!

  • Author singhj Published - 08:45 PM, Mon - 28 August 23
  • Author singhj Published - 08:45 PM, Mon - 28 August 23
అందరి ముందు హీరోయిన్​కు ముద్దు పెట్టిన డైరెక్టర్.. వైరల్ వీడియో!

సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కడమే కష్టం. కానీ కొందరికి ఛాన్సులు వచ్చి, హిట్లు పడినా దాన్ని నిలబెట్టుకోలేకపోతారు. సక్సెస్​ను కొనసాగించి స్టార్లుగా మారాల్సిన వాళ్లు రేసులో వెనుకబడిపోతారు. దీనికి కథల ఎంపికలో తప్పులు, సరైన దర్శకులతో ట్రావెల్ కాకపోవడం లాంటివి కారణాలుగా సినీ విశ్లేషకులు చెబుతుంటారు. ఏదేమైనా టైమ్ కలసిరాకో, లక్ లేకో లేదా స్వీయ తప్పిదాల వల్లో మొత్తానికి అనుకున్న రేంజ్​కు చేరుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అలాంటి కోవలోకే వస్తారు హీరో రాజ్ తరుణ్​. కెరీర్ మొదట్లో వరుస విజయాలతో తక్కువ వ్యవధిలోనే హీరోగా మంచి క్రేజ్ సంపాదించారాయన.

రాజ్ తరుణ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు కావొస్తోంది. ఆయన నటించిన మొదటి సినిమా ‘ఉయ్యాల జంపాల’ 2013లో రిలీజైంది. ఈ సినిమా సూపర్​ హిట్​గా నిలిచింది. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా’, ‘కుమారి 21ఎఫ్​’తో వరుస సక్సెస్​లు అందుకున్నారు రాజ్ తరుణ్​. అయితే విజయాల పరంపరను కొనసాగించడంలో ఆయన విఫలమయ్యారు. సక్సెస్ రాకపోయినా రాజ్ తరుణ్​ ప్రయత్నాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో ఆయన మరో కొత్త చిత్రంతో వచ్చేస్తున్నారు. రాజ్ తరుణ్ నటించిన ‘తిరగబడరా సామీ’ మూవీ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఈ మూవీని ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్​ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు.

‘తిరగబడరా సామీ’లో వయోలెన్స్​కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడి పాత్రలో రాజ్ తరుణ్ కనిపిస్తున్నారు. అయితే ఆయన్ను ప్రేమించే అమ్మాయికి మాత్రం వయొలెన్స్​ అంటే ఇష్టం. రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ మాల్వీ మల్హోత్రా నటిస్తున్న ఈ ఫిల్మ్​లో మరో హీరోయిన్ మన్నారా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్​లో మన్నారా చోప్రాకు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మూవీ యూనిట్ ఫొటోకు ఫోజులు ఇస్తున్న టైమ్​లో, అందరూ చూస్తుండగా హీరోయిన్​కు దర్శకుడు ముద్దులు పెట్టారు. దీంతో షాకైన మన్నారా.. ఆ తర్వాత తేరుకొని నవ్వారు. మన్నారాకు డైరెక్టర్ రవికుమార్ చౌదరి కిస్ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom