iDreamPost
android-app
ios-app

మంజుమ్మల్ బాయ్స్.. లోయలో పడిపోయిన రియల్ సుభాష్ ఇతనే!

  • Published May 07, 2024 | 2:59 PM Updated Updated May 07, 2024 | 2:59 PM

మంజుమ్మల్ బాయ్స్ మాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ పరిశ్రమలో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. అయితే ఈ మూవీని ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన సంగతి విదితమే. ఇందులో లోయలో పడిపోయి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ రియల్ హీరో సుభాష్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

మంజుమ్మల్ బాయ్స్ మాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ పరిశ్రమలో కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఇటీవల ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తోంది. అయితే ఈ మూవీని ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించిన సంగతి విదితమే. ఇందులో లోయలో పడిపోయి.. ప్రాణాలతో బయటపడ్డ ఆ రియల్ హీరో సుభాష్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

  • Published May 07, 2024 | 2:59 PMUpdated May 07, 2024 | 2:59 PM
మంజుమ్మల్ బాయ్స్.. లోయలో పడిపోయిన రియల్ సుభాష్ ఇతనే!

చిన్న లైన్‌తో సినిమా తీసి.. బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతోంది మలయాళ ఇండస్ట్రీ. ఈ నాలుగు నెలల కాలంలో చిన్న సినిమాలే బాక్సాఫీసును షేక్ చేసేశాయి. టాప్ హీరోలు నటించిన బ్రహ్మాయుగం, గోట్ లైఫ్-ఆడు జీవితం వంటి చిత్రాలే కాకుండా.. ఏమాత్రం అంచనాలు లేని ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ పిక్చర్స్ సూపర్ డూపర్ హిట్ చేశారు ప్రేక్షకులు. కేవలం మాలీవుడ్ సినీ లవర్సే కాదు కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. హీరోయిన్, పాటలు లేకపోయినా హిట్ కొట్టొచ్చు అని నిరూపించింది ఈ సర్వైవల్ థ్రిల్లర్ . రూ. 20 కోట్ల పెట్టి సినిమా నిర్మిస్తే.. సుమారు 250 కోట్లను వసూలు చేసింది. ఇటీవల తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ రిలీజ్ చేసింది. ఇక్కడ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మే 5 నుండి ఓటీటీలో సందడి చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్గార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ట్రెమండస్ వ్యూస్‌తో దూసుకెళుతుంది మంజుమ్మల్ బాయ్స్. ఇది ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కించిన మూవీ అన్న విషయం తెలిసిందే. కొచ్చికి చెందిన ఓ పది మంది స్నేహితులు.. కొడైకెనాల్‌కు వెళతారు. కమల్ హాసన్ హీరోగా వచ్చిన గుణ మూవీలోని కేవ్స్ చూద్దామని వెళ్లి.. రిస్ట్రిక్టడ్ ఏరియా అని తెలిసి కూడా లోతైన గుహాల్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ అనుకోకుండా ఓ ఫ్రెండ్ లోతైన లోయలోకి పడిపోతాడు. అతడ్ని మిగిలిన ఫ్రెండ్స్ ఎలా బయటకు తెచ్చారో అన్నదే కథ. 2006లో జరిగిన ఈ ఇన్సిటెండ్ ఆధారంగా చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇందులో సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, పొదువల్ లాల్, దీపక్ పరంబోల్ తదితరులు నటించారు. పరవ ఫిలింస్ బ్యానర్ పై ఈ సినిమా హీరో సౌబిన్ షాహీర్, బాబు షాహీరో, షాన్ ఆంటోనీ నిర్మించారు.

ఇందులో లోయలో పడిపోయిన వ్యక్తి ఎవరంటే.. సుభాష్‌. అతడ్ని బయటకు తీసుకు వస్తాడు మన హీరో కుట్టన్( సౌబిన్). ఇతర ఫ్రెండ్స్ అతడికి సాయంగా నిలుస్తారు. కాగా, ఇప్పుడు ఈ రియల్ సుభాష్‌ ఎవరు, ఈ రియల్ మంజుమ్మల్ బాయ్స్ ఎవరన్నది చాలా మంది నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. అత్యంత డేంజరెస్ లోయలో నుండి బయటపడిన ఏకైక వ్యక్తిగా సుభాష్‌ నిలిచాడు.  ఈ సినిమా మొత్తం ఇతడి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో సుభాష్‌‌గా శ్రీనాథ్ బాసి. మరీ నిజమైన సుభాష్.. అతడి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో తెలుసా..? ఇదిగో ఈ వీడియోను చూడండి. తమ కథ ఆధారంగా మూవీ తీయడంతో వీరికి గుర్తింపు వచ్చింది. దీంతో రియల్ మంజుమ్మల్ బాయ్స్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.వరుస ఇంటర్వ్యూలతో ఫేమస్ అయ్యారు. మీరు చూస్తున్న ఈ వ్యక్తే అసలైన సుభాష్. సుభాష్ పూర్తి పేరు.. సుభాష్ చంద్రన్. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ అంతా పలుచోట్ల స్థిర పడ్డారు. ఈ మూవీ రావడంతో మరోసారి ఫ్రెండ్స్ అంతా కలిసి.. కొడైకెనాల్, గుణ కేవ్స్ ట్రిప్స్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ మూవీ నటుడు దీపక్ పరంబోల్, అపర్ణా దాస్ పెళ్లిలో కూడా మెరిశారు.

 

View this post on Instagram

 

A post shared by Subhash’in Ragasiya Rasigai (@subhashinragasiyarasigai)

 

View this post on Instagram

 

A post shared by Popular Vehicles & Services (@popularmaruti)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom