Venkateswarlu
స్టార్ కిడ్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మంచు విష్ణు. సినిమా మీద ఆసక్తితో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు.
స్టార్ కిడ్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో మంచు విష్ణు. సినిమా మీద ఆసక్తితో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు.
Venkateswarlu
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు చాలా తక్కువ. సక్సెస్ రావాలన్నా.. వచ్చిన సక్సెస్‌ను నిలుపుకుని ముందుకు సాగాలన్నా చాలా కష్టం. కష్టాన్ని దాటాలంటే.. సినిమా మీద ఎంతో ఇష్టం ఉండాలి. అలాంటప్పుడే మనం అనుకున్నది సాధించినా.. సాధించలేకపోయినా సంతోషంగా ముందుకు సాగొచ్చు. మంచు విష్ణు ఇదే ఫార్ములాతో ముందుకు సాగుతున్నారు. తీసే సినిమా సక్సెస్ అయినా.. కాకపోయినా సినిమా మీద ఇష్టంతో ముందుకు వెళుతున్నారు. ఎన్ని ట్రోలింగ్స్ ఎదురైనా వాటిని ఎదురించి తట్టుకుని నిలబడ్డారు. తనను తిట్టిన వారి బాగు గురించి కూడా ఆలోచించి శభాష్ అనిపించారు.
మంచు విష్ణు బాలనటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1985లో వచ్చిన ‘ రగిలే గుండెలు’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాల నటుడిగి ఇదే ఆయన మొదటి, చివరి సినిమా.. ఈ సినిమా తర్వాత మంచు విష్ణు దాదాపు 20 ఏళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2003లో వచ్చిన ‘విష్ణు’ సినిమాతో హీరోగా మారారు. హీరోగా నటించిన తొలి చిత్రానికే ‘ఫిల్మ్ ఫేర్’ అవార్డును సొంతం చేసుకున్నారు. 2007లో వచ్చిన ఢీ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నారు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు. ఆయన తాజాగా ‘ జిన్నా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆయన కన్నప్ప అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. కన్నప్ప శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మంచు విష్ణు కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా, విద్యావేత్తగా, సామాజిక వేత్తగా కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. 2003లో వచ్చిన ‘శివ శంకర్’ అనే సినిమాతో నిర్మాతగా మారారు. తండ్రి హీరోగా నటించిన ఈ సినిమాకు మంచు విష్ణునే నిర్మాణ బాధ్యతులు చేపట్టారు. కరెంట్ తీగ, సింగం 123, మామ మంచు అల్లుడు కంచు, చదరంగం, సన్ ఆఫ్ ఇండియా వంటి సినిమాలను తీశారు. తనకు చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీనుంచే సినిమాలు తీస్తున్నారు. అంతేకాదు! శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో మంచు విష్ణు భాగమయ్యారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్శిటీకి మంచు విష్ణు ప్రో ఛాన్సలర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక, మంచు విష్ణు సినిమాల పరంగానే కాదు.. సామాజిక సేవా కార్యక్రమాల విషయంలో చాలా చురుగ్గా ఉంటారు. పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఆర్మీ అనే సంస్థను స్థాపించారు. కళల్ని ప్రోత్సహించడానికి విష్ణు మంచు ఆర్ట్ ఫౌండేషన్‌ను స్థాపించారు. కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నారు. టాలెంట్ ఉన్న వారికి పట్టం కడుతున్నారు.
2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర సినిమా షూటింగ్ కోసం మలేషియా వెళ్లారు. అక్కడ మంచు విష్ణు ప్రమాదానికి గురయ్యారు. ఆయన నడుపుతున్న బైక్ స్కిడ్ అవ్వటంతో ఆ ప్రమాదం జరిగింది. ఆయన మెడ, భుజానికి తీవ్ర గాయాలు అయ్యాయి. భుజం ఎముక విరిగింది. దీంతో వెంటనే మంచు విష్ణును ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందించాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత కొద్దిరోజులకే ఆయన కోలుకున్నారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన మళ్లీ షూటింగ్‌లో పాల్గొన్నారు. సినిమా 2018 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇద్దరూ తొలిసారిగా 2006లో కలుసుకున్నారు. విరానికా తాతగారి ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి మంచు కుటుంబానికి ఆహ్వానం అందింది. మంచు మోహన్ బాబును రిసీవ్ చేసుకోవటానికి విరానికా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మంచు విష్ణు అక్కడికి వచ్చారు. కారులోంచి బయటకు దిగిన విష్ణుని.. అప్పుడే విరానికా చూశారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ మాట్లాడుకున్నారు. విష్ణుతో ఆమె అంత ఎక్కువ సేపు మాట్లాడటం అదే మొదటి సారి. విష్ణుతో మాట్లాడటం ఆమెకు ఎంతో బాగా అనిపించింది. అప్పుడే ఒకరికి ఒకరు అని ఆమె నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ తరచుగా కలుసుకునే వారు. ఫోన్ లో మాట్లాడుకునే వారు. అలా కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. తర్వాత ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకున్నారు. పెళ్లి పనులు మొత్తం విరానికా దగ్గరుండి చూసుకున్నారు. పెళ్లి ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
2021లో జరిగిన సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రభంజనం సృష్టించారు. కొత్త చరిత్రకు పునాది వేశారు. ప్రత్యర్థి అయిన ప్రకాశ్ రాజ్ పై భారీ మెజార్టీతో విజయం సాధించారు. అప్పట్లో ఈ ఎన్నికలు పెను సంచలనం సృష్టించాయి. జాతీయ మీడియాను సైతం ఆకర్షించాయి. మా ఎన్నికల్లో గెలుపు కోసం మంచు విష్ణు చేసిన కృషి మరువ లేనిది. రాత్రింబవళ్ళు చాలా కష్టపడ్డారు. మా ఎన్నికల్లో తాను గెలిస్తే.. ఎలాంటి మంచి కార్యక్రమాలు చేస్తానో వివరించి చెప్పాడు. నటీనటుల మద్దతు పొంది సంచలన విజయంతో మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
మంచు విష్ణు అనుకున్నది సాధించే వరకు ఏ విషయంలోనూ వెనక్కు తగ్గరు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయనకంటూ ఓ క్రేజ్ ఉంది. సినిమా విషయంలో ఆయనకున్న ప్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయం సాధించాలన్న ఇదితో కంటే.. ఇష్టంతోటే ఆయన సినిమాలు చేస్తూ ఉన్నారు. తాను తీసే సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోతున్నా.. సినిమాలు తీయటంలో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ‘కన్నప్ప’ సినిమాతో ప్యాన్ ఇండియాకు పరిచయం కాబోతున్నారు. కేవలం సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో కన్నప్ప కోసం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీన్ని బట్టే ఆయన తెలుస్తుంది.. ఆయన సినిమా అంటే ఎంత ఇష్టమో..