Krishna Kowshik
తక్కువ సినిమాలు చేసినా.. కొంత కాలం పాటు గుర్తిండిపోయే చిత్రాలను తెరకెక్కించాడు దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి. ఆయన రూపొందించిన చిత్రాల్లో ఒకటి మనమంతా. అందులో ఓ చైల్ట్ ఆర్టిస్టు ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?
తక్కువ సినిమాలు చేసినా.. కొంత కాలం పాటు గుర్తిండిపోయే చిత్రాలను తెరకెక్కించాడు దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి. ఆయన రూపొందించిన చిత్రాల్లో ఒకటి మనమంతా. అందులో ఓ చైల్ట్ ఆర్టిస్టు ఇప్పుడు ఎంతలా మారిపోయిందో తెలుసా..?
Krishna Kowshik
సెలక్టివ్ సినిమాలు చేయడంతో ముందు వరుసలో ఉంటాడు చంద్రశేఖర్ ఏలేటి. 2003లో ఐతే మూవీతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ దర్శకుడు.. ఇప్పటి వరకు ఏడు సినిమాలు మాత్రమే చేశాడు. అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, మనమంతా, చెక్ లాంటి చిత్రాలు చేశాడు. తీసినవి తక్కువ సినిమాలే ఇంపాక్ట్ చేస్తుంటాయి. ఐతే మూవీ బెస్ట్ ఫీచర్స్ ఫిల్మ్ తెలుగు కేటగిరిలో జాతీయ అవార్డును కూడా దక్కించుకుంది. ఇక అనుకోకుండా ఒకరోజు, మనమంతా మూవీలకు పలు కేటగిరిల్లో నందులు వరించాయి. కాగా, ఆయన తీసిన మూవీలో ది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది మనమంతా. 2016లో విడుదలైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది.
ఆంథాలజీ మూవీగా రూపుదిద్దుకుంది మనమంతా. నాలుగు డిఫరెంట్ స్టోరీస్. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జీవితాలు. ఇందులో మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, రోనా రావు, అనిశా ఆంబ్రోస్, గొల్లపూడి మారుతి రావు, వెన్నెల కిశోర్, ఊర్వశి, నాజర్, చంద్రమోహన్, అంకిత వందనపు తదితరులు నటించారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మించారు. మహేష్ శేఖర్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా కమర్షియల్ హిట్ కాకపోయినప్పటికీ.. మౌత్ పబ్లిసిటీతో మంచి టాక్ తెచ్చుకుంది. ఇక ఇందులో మోహన్ లాల్, గౌతమిల కూతురుగా నటించిన పాప గుర్తుందా. మహిత క్యారెక్టర్‌లో కనబడింది. ఆ అమ్మాయే రైనా రావు. ఇంతకు ఆ పాప ఎవరంటే.. ఆర్య మూవీతో అందరి హృదయాలను కొల్లగొట్టిన విద్యారావ్ కూతురే ఈ రైనా.ఇందులో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది ఈమెనే.
రైనా రావు నటించిన తొలి మూవీ మనమంతా. ఆ తర్వాత చెక్ సినిమాలో నటించింది. చెక్ మూవీలో పూజిత.. స్టేట్ లెవల్ చెక్ ప్లేయర్ పాత్రలో కనిపిస్తుంది. ఈమె తండ్రి కూడా నటుడే. చెన్నమనేని శ్రీధర్ రావు. సత్యం, బంగారం, మున్నా, కొమరం పులి, ఆహా నా పెళ్లంట, దమ్ము, గాయత్రి, హ్యాపీ బర్త్ డే, బడుగు, రాజన్న, దమ్ము వంటి చిత్రాల్లో నటించాడు. ఇక విద్య సినిమాల విషయానికి వస్తే బడ్జెట్ పద్మనాభం, మా ఇంటి మహాలక్ష్మి, నేను పెళ్లికి రెడీ, ఏవండోయ్ శ్రీవారు వంటి చిత్రాల్లో నటించింది. శ్రీధర్ రావును వివాహం చేసుకున్న తర్వాత ఆమె పూర్తిగా సినిమాల నుండి దూరమైంది. ఇప్పుడు వీరికి ఇద్దరు పిల్లలు. వారిలో ఒకరు రైనా. ప్రస్తుతం ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. అస్సలు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. ఆ పాప ఈ అమ్మాయి ఒకరేనా అనిపించకమానదు.