Nidhan
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈతరం చూడని ఓ కొత్త సాహసానికి శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న ప్రయోగం ఈ జనరేషన్లో ఫస్ట్ టైమ్.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈతరం చూడని ఓ కొత్త సాహసానికి శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న ప్రయోగం ఈ జనరేషన్లో ఫస్ట్ టైమ్.
Nidhan
మూస ధోరణికి దూరంగా ఉండే నటుల్లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ముందు వరుసలో ఉంటారు. ప్రయోగాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇది ఆయన ఫిల్మోగ్రఫీ చూసి చెప్పేయొచ్చు. తాను ధరించిన పాత్రల్లో ఒకదానికి మరోదానికి సంబంధం లేకుండా చూసుకుంటారాయన. తన క్యారెక్టర్ కంటే మూవీ స్టోరీ, స్క్రీన్‌ప్లే ఎలా ఉందనే దానికి మమ్ముట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే బెస్ట్ ఫిల్మ్స్‌ను ఆడియెన్స్‌కు అందిస్తున్నారు. 70 ఏళ్ల వయసులోనూ ప్రయోగాలతో అలరిస్తున్నారు. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ‘కాథల్: ది కోర్’లో ‘గే’ క్యారెక్టర్లో యాక్ట్ చేసి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. అలాంటి మమ్ముట్టి ఇప్పుడు మరో బిగ్ రిస్క్‌తో రెడీ అయిపోయారు. ఈతరం చూడనటువంటి సరికొత్త సాహసం చేయడానికి ఆయన సిద్ధమయ్యారు.
మమ్ముట్టి మరో డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ రూపొందించిన ఆ చిత్రం పేరు ‘భ్రమయుగం’. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ ఫిల్మ్‌ను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంస్థ నిర్మించింది. ఇందులో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటించారు. డిఫరెంట్ హారర్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాతో మరో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధమయ్యారు మమ్ముట్టి. ఈ చిత్రాన్ని థియేటర్లలో బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో రిలీజ్ చేయనున్నారు. ఒక్క సీన్ కూడా కలర్లో ఉండకుండా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లోనే మూవీని ప్రదర్శించనున్నారు. మామూలుగా కొన్ని సినిమాల్లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ చూపించాల్సి వచ్చినప్పుడు బ్లాక్ అండ్ థీమ్ వాడటం చూస్తుంటాం. కానీ సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో వస్తుండటంతో అందరి ఫోకస్ ‘భ్రమయుగం’ మీద పడింది.
మమ్ముట్టి స్థాయిలో ఉన్న హీరోలు ప్రయోగాలు చేసేందుకు చాలా వెనకాడతారు. హ్యూజ్ ఫ్యాన్‌బేస్, మంచి మార్కెట్ ఉంది కాబట్టి సేఫ్ సైడ్ ఉన్న స్టోరీస్‌తో మూవీస్ చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ మమ్ముట్టి మాత్రం సినిమా అంటే ప్రేక్షకులను రెండున్నర గంటలు సీట్లలో నుంచి లేవకుండా చెప్పే కథ అని నమ్ముతారు. అందుకే విభిన్నమైన చిత్రాలను ఎంచుకుంటూ యువతరాన్ని కూడా ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ‘భ్రమయుగం’తో మరో సాహసానికి ఆయన తెరదీశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 15న రిలీజ్ కానుంది. మమ్ముట్టి ఎక్స్పెరిమెంట్ గురించి తెలిసిన నెటిజన్స్.. ఈ జనరేషన్లో ఓ కమర్షియల్ హీరో ఇలా పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ మూవీలో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అని అంటున్నారు. అందుకు మమ్ముట్టికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఈ స్టైల్లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్సులను కొట్టిపారేయలేం. కాగా, ‘భ్రమయుగం’లో తేవన్ అనే జానపద గాయకుడి పాత్రలో మోహన్‌లాల్ నటించారని తెలుస్తోంది. ఇందులో ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని సమాచారం. మరి.. మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సాహసంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
EXPERIENCE #Bramayugam ONLY IN BLACK & WHITE !
In Cinemas From FEB 15 !#BramayugamFromFeb15 pic.twitter.com/tY4R2QEF9W— Mammootty (@mammukka) February 3, 2024