Salaar 2: సలార్ 2లో మరో స్టార్.. కీలక పాత్ర పోషించనున్న మోహన్ లాల్?

Salaar 2: సలార్ అభిమానులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. దాంతో సలార్ 2 పై అంచనాలు ఇంకా డబుల్ అయ్యాయి.

Salaar 2: సలార్ అభిమానులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. దాంతో సలార్ 2 పై అంచనాలు ఇంకా డబుల్ అయ్యాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దాదాపు 700 కోట్ల దాకా వసూళ్ళని రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్ యాక్షన్ కి అభిమానులు పిచ్చ ఫిదా అయ్యారు. దేవా పాత్రలో సీరియస్ యాంగిల్ లో అదరగొట్టాడు. ఈ సినిమాలో మళయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రని పోషించాడు. ఆయన పాత్ర కూడా ఈ సినిమా సక్సె లో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అభిమానులకు మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందనే చెప్పాలి. దాంతో సలార్ పార్ట్ 2 పై అంచనాలు ఇంకా డబుల్ అయ్యాయి.

ప్రస్తుతం సలార్ పార్ట్ 2 షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా అభిమానులకు అదిరిపోయే ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మళయాళ సీనియర్ స్టార్ హీరో మోహన్ లాల్ కూడా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా మేకర్స్ ఆయన్ని సంప్రదించారట. ఈ సినిమాలో ఆయన పాత్ర గురించి చెప్పగా ఆయనకి బాగా నచ్చిందట. దాంతో ఈ మూవీలో పాత్ర పోషించేందుకు మోహన్ లాల్ సముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై మూవీ టీం నుంచి ఇంకా క్లారిటీ రావాల్సింది.

సలార్ పార్ట్ 1 లో జగపతి బాబు, బాబీ సింహ, శ్రీయా రెడ్డి, శృతి హాసన్ ఇంకా ఈశ్వరీ రావు కూడా తమ పాత్రలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వీరు పార్ట్ 2 లో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు మోహన్ లాల్ కూడా నటించబోతున్నాడని వస్తున్నా వార్తలు ఫ్యాన్స్ లో అంచనాలు రేకెత్తిస్తున్నాయి. అదే కనుక నిజమైతే అభిమానులకు కనుల పండగే అని చెప్పాలి. మరి చూడాలి ఈ వార్త నిజమవుతుందో లేదో.. ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి మోహన్ లాల్ సలార్ 2 సినిమాలో లో నటించబోతున్నాడనే వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments