iDreamPost
android-app
ios-app

రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబుకు కఠోర శిక్షణ! ఎక్కడంటే..?

  • Author ajaykrishna Published - 01:16 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 01:16 PM, Thu - 13 July 23
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబుకు కఠోర శిక్షణ! ఎక్కడంటే..?

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ మూవీ కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబో అనౌన్స్ అయినప్పటి నుండి ఎప్పుడెప్పుడు మూవీ స్టార్ట్ అవుతుందా అని చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ.. మహేష్ బాబు ఓవైపు త్రివిక్రమ్ తో ‘గుంటూరు కారం’ మూవీతో బిజీ అయిపోయాడు. మరోవైపు రాజమౌళి మహేష్ మూవీ కోసం స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే.. రాజమౌళి సినిమా అంటేనే.. ఆ భారీతనం.. ఆ సెట్ వర్క్.. బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్స్.. బడ్జెట్.. ఇలా అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి.

ఆల్రెడీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ మూవీస్ తో రాజమౌళి గ్రాండియర్ విజన్.. వరల్డ్ వైడ్ ప్రూవ్ అయినప్పటికీ.. ఈసారి మహేష్ బాబుతో ప్రాజెక్ట్ మరింత బిగ్ రేంజ్ లో ఉండబోతుందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆయన మాటలు విన్నాక అభిమానులలో అంచనాలు మరింత పీక్స్ కి చేరుకున్నాయి. అయితే.. రాజమౌళి, మహేష్ ల సినిమా.. ఈ ఏడాది ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకొని.. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గ్లోబ్ ట్రోటరింగ్ జానర్ లో మూవీ ఉండనుంది. కాబట్టి.. సినిమాలో జంగల్ అడ్వంచర్ తో కూడిన అంశాలు చాలా ఉంటాయి. దీనికోసం మహేష్ శారీరకంగా, మానసికంగా సిద్ధం కావాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. రాజమౌళితో సినిమా కోసం మహేష్ బాబు శారీరకంగా శిక్షణ తీసుకోనున్నాడట. అది కూడా బ్యాంకాక్ లో అని తెలుస్తుంది. దాదాపు మూడు నెలలపాటు సాగనున్న ఈ శిక్షణలో.. మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్, హైకింగ్, స్కేలింగ్ టెక్నిక్స్, ఇంకా ట్రెక్కింగ్ లాంటివి నేర్చుకోబోతున్నాడట మహేష్. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. విషయం తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ సూపర్ ఎక్సయిట్ అవుతున్నారు. ఈ సినిమాను బిగ్ రేంజ్ లో కేఎల్ నారాయణ నిర్మించనుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. మరి రాజమౌళి మహేష్ ని పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలా ప్రెజెంట్ చేస్తాడోనని అందరిలోనూ ఎక్సయిట్ మెంట్ పెరిగిపోతుంది. మరి మహేష్, రాజమౌళి కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.