P Venkatesh
టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు మరో మల్టీప్లెక్స్ నిర్మించనున్నారు. మహేష్ అడ్డాగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ మల్టీప్లెక్స్ రెడీ కాబోతోంది.
టాలీవుడ్ ను ఏలుతున్న టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు మరో మల్టీప్లెక్స్ నిర్మించనున్నారు. మహేష్ అడ్డాగా మారిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ మల్టీప్లెక్స్ రెడీ కాబోతోంది.
P Venkatesh
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అలరించిన విషయం తెలిసిందే. థియేటర్లలో రమణగాడి మాస్ జాతర కొనసాగింది. స్మార్ట్ గా స్టైలిష్ గా ఉండే మహేష్ మాస్ లుక్ లో దర్శనమివ్వడంతో ఫాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కాగా ఇప్పుడు దర్శకదీరుడు రాజమౌళి-మహేష్ కాంబోలో పాన్ వరల్డ్ మూవీ రాబోతోంది. ఎస్ఎస్ఎంబీ29 పై టాలీవుడ్ వర్గాలతో పాటు ఫ్యాన్స్ లో విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. ఇదిలా ఉంటే మహేష్ ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు అడ్డాగా పేరుగాంచిన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏఎంబీ మల్టీప్లెక్స్ నిర్మాణం జరుగబోతోంది. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఫ్యాన్స్ చేసే సందడే వేరు. థియేటర్ల వద్ద తమ అభిమాన హీరోల కటౌట్స్ కట్టి బ్యాండు మేళాలతో బాణాసంచ కాలుస్తూ నానా హంగామా చేస్తారు. తారలు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ కు తరలిరావడంతో థియేటర్ల వద్ద మరింత కోలాహలంగా మారుతుంది. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అందరికి ఒక లెక్క అయితే మహేష్ కు మరో లెక్క. మహేష్ నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలు సిల్వర్ జూబ్లీ ఆడి రికార్డ్ క్రియేట్ చేశాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న థియేటర్లలో ముఖ్యంగా సుదర్శన్ 35 ఎంఎంని తమ కోటగా భావిస్తారు మహేష్ ఫ్యాన్స్.
అయితే ఇప్పుడు ఈ ఎమోషనల్ కనెక్షన్ మరింత బలంగా మారనుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మహేష్ మల్టీప్లెక్స్ కట్టబోతున్నారు. సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ఎఎంబి క్లాసిక్ సినిమాస్ మల్టీప్లెక్స్ రెడీ కాబోతోంది. మొత్తం 7 స్క్రీన్లతో ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించనున్నారు. మహేష్, ఏషియన్ భాగస్వామ్యంలో ఏఎంబీ క్లాసిక్ సిద్ధం కాబోతోంది. ఇప్పటికే మల్టీప్లెక్స్ బిజినెస్ లో సక్సెస్ అయిన సూపర్ స్టార్ హైదరాబాద్ లో ఏఎంబీ మల్టీప్లెక్స్ ల పేరిట థియేటర్లు రన్ అవుతున్నాయి. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్ నిర్మించనుండడంతో ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు.
#AMBClassic pic.twitter.com/XYyNX282ks
— Aakashavaani (@TheAakashavaani) February 26, 2024