Venkateswarlu
లియో సినిమా ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. పాత తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలనుకుంటున్నారట. ఈ ఆరు నెలల బ్రేక్‌పై లోకేష్ తాజాగా స్పందించారు.
లియో సినిమా ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. పాత తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలనుకుంటున్నారట. ఈ ఆరు నెలల బ్రేక్‌పై లోకేష్ తాజాగా స్పందించారు.
Venkateswarlu
ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 6 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. ఇందుకు ఓ బలమైన కారణమే ఉంది. లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను చాలా పగడ్బంధీగా తెరకెక్కించాలని లోకేష్ భావిస్తున్నారట. అందుకే ఓ ఆరు నెలల పాటు సినిమాలకు దూరంగా వెళ్లాలని నిశ్చయించుకున్నారట. కేవలం సూపర్ స్టార్ సినిమా కథ కోసమే ఈ ఆరు నెలల్ని వెచ్చించనున్నారట.
లియో సినిమా ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. పాత తప్పులు రిపీట్ కాకుండా చూసుకోవాలనుకుంటున్నారట. ఈ ఆరు నెలల బ్రేక్‌పై లోకేష్ తాజాగా స్పందించారు. బ్రేక్ తీసుకోవటం వాస్తవమేనని స్పష్టం చేశారు. కాగా, ఇళయ దళపతి విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తాజాగా ‘లియో’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. దానికితోడు కలెక్షన్ల విషయంలో సినిమా టీం స్కాంకు పాల్పడిందని తమిళనాడు థియేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్రమణియన్ ఆరోపించారు.
గత కొద్దిరోజుల నుంచి లియో కలెక్షన్లపై వివాదం నడుస్తోంది. థియేటర్ల యజమాన్యులు సుబ్రమణియన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా లోకేష్ స్పందించారు. సినిమా సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్‌గా ఉందని అన్నారు. కలెక్షన్ల విషయం తనుకు సంబంధం లేనదని స్పష్టం చేశారు. కలెక్షన్ల విషయాన్ని నిర్మాతలకు వదిలేశారు. మరి, లోకేష్ కనగరాజ్ ఆరు నెలల పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BREAKING: #LokeshKanagaraj CONFIRMS to take a break for 6 months.
He will be concentrating fully on superstar #Rajinikanth‘s #Thalaivar171 script.
The director earlier said, he doesn’t want release date pressure… pic.twitter.com/TwqSHGAJ3g
— Manobala Vijayabalan (@ManobalaV) October 30, 2023