iDreamPost
android-app
ios-app

రాజ్‌ తరుణ్‌పై ప్రియురాలి ఫిర్యాదు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ

  • Published Jul 05, 2024 | 12:42 PM Updated Updated Jul 05, 2024 | 3:47 PM

Raj Tharun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాలతో ఆడియన్స్ ను అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరోపై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది.

Raj Tharun: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాలతో ఆడియన్స్ ను అలరించాడు. తాజాగా ఈ యంగ్ హీరోపై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది.

  • Published Jul 05, 2024 | 12:42 PMUpdated Jul 05, 2024 | 3:47 PM
రాజ్‌ తరుణ్‌పై ప్రియురాలి ఫిర్యాదు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో జరిగే వివాదాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.  ముఖ్యంగా  పలువురు సెలబ్రిటీలపై వివిధ ఫిర్యాదులు, ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసింది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ పై  లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. రాజ్ తరుణ్ పై పలు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని ఆ  యువతి ఆరోపించింది. ఇది  ఇలాంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై నార్సింగ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని  తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి  ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనేక సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన ‘తిరగబడరా సామీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి సంచలన ఆరోపణలు చేసింది. ఏకంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటున్నాని నమ్మించి.. వాడుకుని వదిలేశాడని ఆ యువతి ఆరోపించింది. తను ప్రేమించి.. శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ లావణ్య లిఖితపూర్వకంగా  ఫిర్యాదు చేసింది.

దాదాపు 11 ఏళ్లుగా రాజ్‌తరుణ్‌తో సహజీవనంలో ఉన్నానని ఆమె తెలిపింది.తామిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పింది. అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ తో అఫైర్‌ పెట్టుకొని తనను వదిలేశడని ఆ యువతి ఆరోపిస్తోంది. 3 నెలల క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడని, అతడిని వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పేర్కొంది. హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లిన లావణ్య పై విధంగా పోలీసులకు లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేసింది. రాజ్‌ తరుణ్‌ తన ప్రపంచం..రాజ్‌ తనకు కావాలని, తనకు న్యాయం చేయాలని పోలీసులకు లావణ్య విజ్ఞప్తి చేసింది.  గతంలో తనను డ్రగ్స్‌ కేసులో కావాలనే ఇరికించారని, అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నాని, ఆ సమయంలో రాజ్‌ తనకెలాంటి సాయం చేయలేదంటూ లేఖలో పేర్కొంది. దీంతో ఇది కాస్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio