iDreamPost
android-app
ios-app

చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విశ్వంభర మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్

  • Published Jul 20, 2024 | 1:42 PM Updated Updated Jul 20, 2024 | 1:42 PM

Latest Update From Viswambhara: ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బజ్ ఏమి వినిపించడం లేదు అనుకునే సమయానికి క్రేజి అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Latest Update From Viswambhara: ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి బజ్ ఏమి వినిపించడం లేదు అనుకునే సమయానికి క్రేజి అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 20, 2024 | 1:42 PMUpdated Jul 20, 2024 | 1:42 PM
చిరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..  విశ్వంభర మూవీ నుంచి లేటెస్ట్ అప్ డేట్

ఇప్పుడు ప్రేక్షకులంతా తారక్ , చరణ్ , బన్నీ సినిమాల కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో.. చిరు సినిమా కోసం కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసిన టైమ్ లో చిరు మూవీ కోసం చేస్తున్న వర్క్ అవుట్ వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఇక ఈ సినిమా గురించి ఎలాంటి బజ్ లేదు అనుకునే సమయానికి క్రేజి అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. సాధారణంగా సెలెబ్రిటీల బర్త్ డే సంధర్బంగా .. వారి మూవీస్ కు సంబంధించిన ఎదో ఒక అప్ డేట్ ను రిలీజ్ చేస్తున్న సంగతు తెలిసిందే. మరి ఈ మూవీ నుంచి రాబోయే అప్ డేట్ ఏంటో చూసేద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా… “విశ్వంభర” తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా త్రిష నటిస్తుంది. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో చిరు నుంచి ఎలాంటి ఫాంటసీ మూవీ రాలేదు. మరి ఈ మూవీ ఆ లోటును భర్తీ చేస్తుందేమో చూడాలి. ఈ మూవీలో త్రిష తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉండబోతున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజి అప్ డేట్ ను రివీల్ చేశారు మేకర్స్. ఆగష్టు 22 న చిరంజీవి బర్త్ డే సంధర్బంగా.. విశ్వంభర మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. దీనితో చిరు ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అలాగే విశ్వంభర మూవీని.. 2025 జనవరి 10 న రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెల్సిందే. మరి ఎంతవరకు అనుకున్న ప్రకారం అవుతుందో చూడాలి.

ఇక విశ్వంభర మూవీ విషయానికొస్తే… ఇప్పటికే ఈ మూవీ సగం షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. దాదాపు సినిమా షూటింగ్ మొత్తాన్ని ఆగష్టు నెలాఖరుకు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం డబ్బింగ్ , ఎడిటింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో పద్దెనిమిదేళ్ల తర్వాత త్రిష, చిరు జోడిగా నటిస్తున్నారు. మరి ఈసారి ఈ జంట ప్రేక్షకుల నుంచి ఎలాంటి మెప్పు పొందుతారో వేచి చూడాలి. చెప్పాలంటే ప్రస్తుతం షూటింగ్ పనులు వేగంగానే కొనసాగుతున్నాయని చెప్పి తీరాలి. ఇక రిలీజ్ తర్వాత ఈ సినిమాపై కొనసాగుతున్న హైప్ ఎలా ఉంటుంది అనే దానికోసం వెయిట్ చేయాల్సిందే. మరి విశ్వంభర మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş