iDreamPost
android-app
ios-app

పవన్ బర్త్ డేకి OG నుండి ట్రీట్ పక్కా! కాకుంటే ఒక్కటే చిక్కు!

  • Published Aug 21, 2024 | 6:14 PM Updated Updated Aug 21, 2024 | 6:14 PM

Pawan Kalyan OG Movie Latest Update: ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజి' సినిమా నుంచి క్రేజి అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Pawan Kalyan OG Movie Latest Update: ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజి' సినిమా నుంచి క్రేజి అప్ డేట్ వచ్చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 21, 2024 | 6:14 PMUpdated Aug 21, 2024 | 6:14 PM
పవన్ బర్త్ డేకి OG నుండి ట్రీట్ పక్కా! కాకుంటే ఒక్కటే చిక్కు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక కొన్నాళ్లుగా పవర్ స్టార్ అభిమానులు ఆయన సక్సెస్ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వలన అది పోస్ట్ పోన్ అయింది. దీనితో అనుకున్న తేదికి తమ హీరో సినిమా రిలీజ్ కావడం లేదనే నిరాశ కూడా వారిలో ఉంది. అయితే ఇప్పుడు పవన్ వాటి అన్నిటిని తుడిచిపెట్టేసి.. బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తాజాగా ‘ఓజి’ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో సెలేబ్రిటిల బర్త్ డేస్ కు… వారి కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇవ్వడం కామన్ అయిపొయింది. అయితే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే ఉంది. ఈ క్రమంలో ఆరోజున ‘ఓజి’ నుంచి రాబోతున్న అప్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. సహజంగా మూవీకి సంబంధించిన అప్ డేట్ అంటే.. పోస్టర్ , లిరికల్ సాంగ్ లేదా మూవీ టీజర్ ను రిలీజ్ చేస్తారు. దేనిని రిలీజ్ చేస్తున్నాం అనే దాని గురించి ముందే అప్ డేట్ ఇస్తారు. కానీ ‘ఓజి’ మూవీ విషయంలో మాత్రం ఇక్కడ ఓ చిన్న చిక్కు ఉంది. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన పై మూడింటిని రెడీ చేశారు. కానీ బర్త్ డే రోజున దేనిని రివీల్ చేస్తారో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. దర్శకుడు హీరో మాట్లాడుకుని ఎదో ఒక దానిని మాత్రమే రివీల్ చేయనున్నట్లు సమాచారం. కాబట్టి ఆ అప్ డేట్ ఏంటో తెలియాలంటే అప్పటివరకు ఎదురుచూపులు తప్పవు.

ఓజి సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు.. చెప్పుకొచ్చారు మేకర్స్. కానీ మూవీ విడుదల తేదీ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఓ వైపు ఓజి అప్ డేట్ కోసం ఎదురుచూస్తూనే.. గబ్బర్ సింగ్ రీరిలీజ్ కు కూడా అదే రేంజ్ లో సెలెబ్రేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. మరి ఈ రీరిలీజ్ మూవీ ఎలాంటి రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందో.. ఓజి నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తుందో వేచి చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom