iDreamPost
android-app
ios-app

Vijay Devarakonda: త్వరలోనే పెండింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్న విజయ్ దేవరకొండ

  • Published Mar 11, 2024 | 3:08 PM Updated Updated Mar 11, 2024 | 3:08 PM

విజయ్ దేవరకొండ గతంలో అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో విజయ్ ఒక సినిమాని గతంలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ గతంలో అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో విజయ్ ఒక సినిమాని గతంలో స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

  • Published Mar 11, 2024 | 3:08 PMUpdated Mar 11, 2024 | 3:08 PM
Vijay Devarakonda: త్వరలోనే పెండింగ్ ప్రాజెక్ట్ షూటింగ్ స్టార్ట్ చేయనున్న విజయ్ దేవరకొండ

యూత్ లో సెన్సేషనల్ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి వంటి ఇంటెన్స్ క్యారెక్టర్ లో తనదైన నటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరిగా ఉన్న విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదల కానున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నారు. విజయ్ నటించిన గీత గోవిందం చిత్రాన్ని సూపర్ హిట్ చేసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై దిల్ రాజు నిర్మిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇదివరకే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇక త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణను పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. విజయ్ కూడా ఇటీవలే తన డబ్బింగ్ చెప్పేశారట. ఈ సినిమా ప్రమోషన్‌ను చిత్ర బృందం త్వరలో ప్రారంభించనుంది. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ గతంలో అనౌన్స్ చేసిన బిగ్ ప్రాజక్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో విజయ్ ఒక సినిమాని గతంలో స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లడంతో ఈ సినిమా ఆగిపోయింది. తాజా వార్తల ప్రకారం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే తిరిగి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. విజయ్ మార్చి నెలాఖరులో ఈ సినిమా సెట్స్‌ పైకి రానున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా కొత్త షెడ్యూల్ శ్రీలంకలో జరగనుందట. 2024లోనే విడుదల కానున్న ఈ సినిమాలో విజయ్ మొట్ట మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

విజయ్ ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్న సమయంలో గౌతమ్ ఒక చిన్న సినిమా తీశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ యూత్ ఫుల్ ఎమోషనల్ డ్రామా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకి సంభందించిన పెండింగ్ వర్క్స్ పూర్తి చేసుకుని గౌతమ్ తిననూరి ఈ వారంలోపు ఫ్రీ అవుతారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం పై చాలా పుకార్లు వచ్చాయి. నిజానికి VD12 పూజా కార్యక్రమంలో సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల పాల్గొన్నారు. అయితే డేట్స్ క్లాష్ వల్ల ఆమె ఈ సినిమా నుండి తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఇపుడు ఆ పాత్రకు ‘యానిమల్’తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన త్రిప్తి దిమ్రిని నిర్మాతలు సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘సప్తసముద్రాలు దాటి’ సినిమాతో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణీ వసంత్ ను కూడా సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş