Krishna Kowshik
Kushboo: జస్టిస్ హేమ కమిటి ఇచ్చిన రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికపై మాలీవుడ్ ఇండస్ట్రీ గళం విప్పింది. తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి.. పలువురు నటీమణులు స్పందించారు. తాజాగా ఖుష్బూ కూడా.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంటూ..
Kushboo: జస్టిస్ హేమ కమిటి ఇచ్చిన రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికపై మాలీవుడ్ ఇండస్ట్రీ గళం విప్పింది. తమకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి.. పలువురు నటీమణులు స్పందించారు. తాజాగా ఖుష్బూ కూడా.. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంటూ..
Krishna Kowshik
మాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్, కమిట్ మెంట్స్, ఎడ్జస్ట్ మెంట్స్ వంటి లైంగిక వేధింపులున్నాయంటూ జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ ఇండస్ట్రీని కుదిపేసింది. రిపోర్డ్ విడుదలవ్వగానే మళయాళ పరిశ్రమలోని నటీమణులు తమ గళాన్ని విప్పుతున్నారు. సినిమాలో ఛాన్స్ అంటూ ప్రముఖ నటుడు సిద్దిఖీ హోటల్ రూంకి పిలిచి తనపై అత్యాచారానికి ఒడిగట్టాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది నటి రేవతి సంవత్. అలాగే షూటింగ్ సమయంలో ఆ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, ఇక్కడ వేధింపులు తట్టుకోలేక పరాయి ఇండస్ట్రీకి పారిపోయానంటూ ముని మునీర్ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఆరోపణలతో మలయాళ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (అమ్మ) మొత్తం మూకుమ్మడి రాజీనామాలు చేసింది. ఈ నేపథ్యంలో అమ్మ పాలక మండలి రద్దైంది.
ఇదిలా ఉంటే కేవలం మాలీవుడ్ నటీమణులే కాదు.. పొరుగు రాష్ట్ర యాక్ట్రెస్ కూడా ఈ విషయంపై చర్చిస్తున్నారు. ఇప్పటికే స్టార్ నటి సమంత నివేదికపై స్పందించింది. సీనియర్ నటి ఊర్వశి సైతం తన స్పందన తెలియజేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటి ఖుష్బు కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. హేమ కమిటీ నివేదికను స్వాగతించాలని జాతీయ మహిళా కమిషనర్ ఖుష్బూ కోరారు. ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయంటూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. సినీ పరిశ్రమకు చెందిన మహిళలు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఎదురైన వేధింపులను బయటపెట్టడానికి హేమ కమిటీ రిపోర్ట్ ఉపయోగపడిందని ఖుష్బు కొనియాడారు. ఈ విషయంపై తన కూతుళ్లతో చర్చించినట్లు తెలిపారు. సుదీర్ఘమైన పోస్టు చేశారు.
‘ మా నాన్న వేధింపుల గురించి మాట్లాడేందుకు ఇంత సమయం ఎందుకు పట్టిందని అడుగుతుంటారు. నేను కూడా ఒప్పుకుంటా. అయితే నాకు ఎదురైన వేధింపులు కెరీర్ నిర్మించుకునే క్రమంలో జరిగినవి కావు. చాలా మంది మహిళలకు కుటుంబం నుండి సరైన మద్దుతు ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. నేను సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో నాకు చేయూతగా నిలబడాల్సిన తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యా.’ అంటూ పేర్కొంది. స్త్రీ ఎప్పుడూ స్వతంత్య్రంగా నిలబడాలి, ఆమె ఏ విషయంలోనూ రాజీ పడకూడదన్నారు. బాధితురాలికి అండగా నిలవాలని పురుషులను అభ్యర్థిస్తున్నానన్నారు. ‘ప్రతి పురుషుడు ఓ తల్లి గర్భం నుండి పుట్టిన వాడే. అలాగే మిమ్మల్ని తీర్చిదిద్దిన తల్లికి, సోదరీమణులకు, టీచర్లకు, స్నేహితుల వంటి స్త్రీ మూర్తులకు అండగా నిలవండి. మీ మద్దతు వారికి ఆశాకిరణం కావచ్చు. మహిళల్ని గౌరవించరండి. హింసకు వ్యతిరేకంగా పోరాడండి’ అంటూ హితవు పలికారు.
💔 This moment of #MeToo prevailing in our industry breaks you. Kudos to the women who have stood their ground and emerged victorious. ✊ The #HemaCommittee was much needed to break the abuse. But will it?
Abuse, asking for sexual favors, and expecting women to compromise to…
— KhushbuSundar (@khushsundar) August 28, 2024Justice