iDreamPost
android-app
ios-app

టాలీవుడ్​లోనూ ఓ హేమ కమిటీ వేయాలి.. CM రేవంత్​కు మంచు విష్ణు రిక్వెస్ట్!

  • Published Sep 06, 2024 | 7:59 AM Updated Updated Sep 06, 2024 | 7:59 AM

Manchu Vishnu, CM Revanth Reddy, MAA, Justice Hema Committee Report: ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటారు టాలీవుడ్ హీరో, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు. అదే ఆయన స్టైల్. తాజాగా ఓ కమిటీ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Manchu Vishnu, CM Revanth Reddy, MAA, Justice Hema Committee Report: ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటారు టాలీవుడ్ హీరో, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు. అదే ఆయన స్టైల్. తాజాగా ఓ కమిటీ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

  • Published Sep 06, 2024 | 7:59 AMUpdated Sep 06, 2024 | 7:59 AM
టాలీవుడ్​లోనూ ఓ హేమ కమిటీ వేయాలి.. CM రేవంత్​కు మంచు విష్ణు రిక్వెస్ట్!

ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతుంటారు టాలీవుడ్ హీరో, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారు. అదే ఆయన స్టైల్. తాజాగా ఓ కమిటీ గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్​లోనూ అలాంటి కమిటీ అవసరం ఉందని.. దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన రిక్వెస్ట్ చేశారు. మంచు విష్ణు చెప్పిన ఆ కమిటీ మరేదో కాదు.. మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న జస్టిస్ హేమ కమిటీ. అక్కడి చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఆ కమిటీ సంచలన విషయాలను తమ నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలంగాణ సర్కారుకు విజ్ఞప్తి చేశారు.

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలకు రక్షణ, భద్రత మరింత మెరుగుపడేలా వాళ్ల తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్​ను మంచు విష్ణు కోరారు. కెమెరా ముందు, వెనుక ప్రతి ఒక్కరికీ సేఫ్టీ అవసరమని, సురక్షిత పరిస్థితులు ఉండాలనే దానికి తాము చాలా ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. టాలీవుడ్ డెవలప్​మెంట్​కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు విష్ణు. మహిళల భద్రత, సాధికారతకు ప్రతిరూపంగా నిలిచేలా ఇండస్ట్రీలోని అందరి నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నామంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్​లో ఆయన రాసుకొచ్చారు. మంచు విష్ణు పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనంగా మారింది. అందులోని విషయాల గురించి మాలీవుడ్​లోనే కాదు.. ఇతర మూవీ ఇండస్ట్రీస్​లోనూ డిస్కషన్స్ నడుస్తున్నాయి.

జస్టిస్ హేమ కమిటీ లాంటిది తమ ఇండస్ట్రీలోనూ ఏర్పాటు చేయాలని కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్ దాదాపు 150 మంది ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు లెటర్ రాశారు. ఇదే క్రమంలో టాలీవుడ్​లోనూ అలాంటి కమిటీ ఒకటి వేయమంటూ తాజాగా ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​కు లేఖ రాశారు. విమెన్ సేఫ్టీపై విష్ణు చేసిన ఈ రిక్వెస్ట్​పై సీఎం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక, మాలీవుడ్​లో సంచలనం సృష్టిస్తున్న హేమ కమిటీని 2019లో కేరళ సర్కారు ఏర్పాటు చేసింది. 2017లో కొచ్చిలో ఓ నటి కిడ్నాప్ కేసులో ఒక నటుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ వేశారు. ఈ కమిటీ అక్కడి ఇండస్ట్రీలోని విమెన్ ఇష్యూస్, వర్కింగ్ కండీషన్స్, రెమ్యూనరేషన్ తదితర విషయాలను అధ్యయనం చేసి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.