iDreamPost
android-app
ios-app

Nivin Pauly: లైంగిక ఆరోపణల కేసు.. క్లారిటీ ఇచ్చిన ప్రేమమ్ హీరో! ఏమన్నాడంటే?

  • Published Sep 04, 2024 | 9:24 AM Updated Updated Sep 04, 2024 | 9:24 AM

Nivin Pauly clarity on police case: ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ తనను లైంగికంగా వేధించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు నివిన్ పౌలీ. ఏమన్నాడంటే?

Nivin Pauly clarity on police case: ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ తనను లైంగికంగా వేధించాడని ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై తాజాగా స్పందించాడు నివిన్ పౌలీ. ఏమన్నాడంటే?

Nivin Pauly: లైంగిక ఆరోపణల కేసు.. క్లారిటీ ఇచ్చిన ప్రేమమ్ హీరో! ఏమన్నాడంటే?

జస్టిస్ హేమ కమిటి ఇచ్చిన నివేదిక మలయాళ సినిమా పరిశ్రమను షేక్ చేసింది. ఈ నివేదిక బయటకి వచ్చిన తర్వాత పలువురు మహిళలు తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడం మెుదలుపెట్టారు. వేధింపులకు గురైన వారిలో హీరోయిన్స్ కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ తనను లైంగికంగా వేధించాడని ఓ నటి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో హీరోతో సహా ఆరుగురిపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హీరో నివిన్ పౌలీ.

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.. నన్ను దుబాయ్ తీసుకెళ్లి, అక్కడ లైంగికంగా వేధించాడు అంటూ ప్రేమమ్ హీరో నివిన్ పౌలీపై ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఈ విచారణలో హీరో,  ఓ నిర్మాతతో సహా మరో నలుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్వయంగా నివిన్ స్పందించాడు.

“మూవీ ఛాన్స్ లు ఇప్పిస్తానని చెప్పి, ఓ నటిని దుబాయ్ తీసుకెళ్లి లైంగికంగా వేధించానని నాపై వచ్చిన వార్తలు విన్నాను. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నాపై వచ్చిన ఈ నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నాను. అవన్నీ పచ్చి అబద్దాలు. ఈ విషయంపై నేను న్యాయంగా పోరాడుతాను” అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు నివిన్. కాగా.. ప్రేమమ్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ క్రమంలో నివిన్ పై లైంగిక ఆరోపణలు రావడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Nivin Pauly (@nivinpaulyactor)