Somesekhar
Simran, Justice Hema Committee report: జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై తాజాగా స్పందించింది సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. తాను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాను అంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది.
Simran, Justice Hema Committee report: జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ పై తాజాగా స్పందించింది సీనియర్ హీరోయిన్ సిమ్రాన్. తాను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాను అంటూ సంచలన విషయాన్ని వెల్లడించింది.
Somesekhar
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నివేదిక సంచలనంగా మారింది. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులపై ఈ కమిటీ తన రిపోర్ట్ ను వెల్లడించింది. ఈ నివేదిక ఎప్పుడైతే బయటకి వచ్చిందో.. అప్పటి నుంచి ఒక్కొక్క నటీమణులు తమపై జరిగిన ఆకృత్యాల గురించి ప్రపంచానికి చెబుతూ వస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారిలో హీరోయిన్స్ కూడా ఉండటం గమనార్హం. తాజాగా హేమ కమిటీ రిపోర్ట్ పై సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ స్పందించారు. అలాగే తాను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాను అంటూ షాకింగ్ విషయాలను వెల్లడించింది.
మలయాళ చిత్ర పరిశ్రమనే కాక.. ఇతర ఇండస్ట్రీలను కూడా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్స్ ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి కమిటీనే మా పరిశ్రమలో కూడా వేయాలని తెలుగు, కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలకు చెందిన కొందరు సినీ నటులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇక హేమ కమిటీ రిపోర్టులు వచ్చిన తర్వాత చాలా మంది హీరోయిన్స్ స్పందించారు. చిత్ర పరిశ్రమలో మహిళలపై ఇలాంటి దారుణమైన వేధింపులకు పాల్పడటం హేయమైన చర్యగా వారి అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ కూడా తానూ లైంగిక వేధింపులకు గురైయ్యాను అంటూ చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది.
“ఒక మహిళపై లైంగిక వేధింపులు జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించడం దారుణం. సంఘటన జరిగిన వెంటనే అలా ఎలా చెప్పగలం? ఆ సమయంలో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే చాలా సమయం పడుతుంది. పైగా ఎవరు ఏమనుకుంటారో అన్న భయం వారిలో ఉండనే ఉంటుంది. ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీదు. అందుకే సమయం, సందర్భం వచ్చినప్పుడే వాటి గురించి వెల్లడిస్తారు. ఇక నా చిన్న తనంలో చాలాసార్లు లైంగిక వేధింపులకు గురైయ్యాను. కానీ వాటి గురించి ఇప్పుడు చెప్పలేను” అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. కాగా.. జస్టీస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (AMMA) అధ్యక్ష పదవికి మోహన్ లాల్ రాజీనామా చేశాడు. 17 మంది కమిటీ సభ్యులు కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దాంతో అమ్మ కమిటీ రద్దైపోయింది. త్వరలోనే కొత్త అసోసియేషన్ ను ఎన్నుకోనున్నారు. మరి తాను కూడా లైంగిక వేధింపులకు గురైయ్యాను అని చెప్పి షాక్ కు గురిచేసిన సిమ్రాన్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.