iDreamPost
android-app
ios-app

పరారీలో ప్రముఖ నటుడు.. అరెస్ట్ వారెంట్ జారీ! ఎందుకంటే?

  • Published Sep 24, 2024 | 3:47 PM Updated Updated Sep 24, 2024 | 3:47 PM

arrest warrant issued for Malayalam actor Siddique: ఓ ప్రముఖ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నటుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

arrest warrant issued for Malayalam actor Siddique: ఓ ప్రముఖ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ నటుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..

పరారీలో ప్రముఖ నటుడు.. అరెస్ట్ వారెంట్ జారీ! ఎందుకంటే?

జస్టిస్ హేమ కమిటి రిపోర్ట్.. మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడి చిత్ర పరిశ్రమలో మహిళలపై ఎలాంటి లైంగిక వేధిపులు జరుగుతున్నాయో ఈ రిపోర్ట్ బయటపెట్టింది. ఇక ఈ నివేదిక ఎప్పుడైతే బయటకి వచ్చిందో.. అప్పటి నుంచి ఒక్కొక్కరుగా తమపై జరిగిన అఘాయిత్యాల గురించి బయటపెడుతూ వస్తున్నారు ఇండస్ట్రీకి చెందిన సదరు మహిళలు. ఈ క్రమంలోనే ఓ మహిళ ప్రముఖ నటుడు సిద్ధిఖీపై లైంగిక ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. దాంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడికి అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నటుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రముఖ నటుడు సిద్ధిఖీపై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయడంతో.. అతడిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు అతడికి అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. అప్పటికే సిద్ధికీ ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకున్నాడు. కానీ దాన్ని కోర్టు తిరస్కరించింది. ఇక ప్రస్తుతం అతడు తప్పించుకుని తిరుగుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధిఖీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు కేసు ఏంటంటే? సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం..”ఓ తమిళ మూవీలో అవకాశం ఇప్పిస్తానని సిద్ధిఖీ చెప్పాడు. అందుకోసం తన లైంగిక అవసరాలు తీర్చమన్నాడు. దానికి నేను నో చెప్పడంతో.. బలవంతంగా ఓ హోటల్ లో అత్యాచారం చేశాడు. 2016లో ఈ ఘటన జరిగింది” అని ఆ మహిళ పోలీసులతో పేర్కొంది.

కాగా.. తాజాగా హేమ కమిటీ రిపోర్టులు బయటకి రావడంతో.. చాలా మంది మహిళలు తమపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. వీరిలో హీరోయిన్స్ కూడా ఉండటం గమనార్హం. అందులో భాగంగానే ఈ మహిళ కూడా తనపై సిద్ధిఖీ అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇక కేసును విచారించిన కోర్టు.. తాజాగా అతడికి అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఇక సిద్ధిఖీ ముందస్తు బెయిల్ కు అప్లై చేసుకోగా.. కోర్టు దానిని తిరస్కరించింది. ప్రస్తుతం పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.