iDreamPost
android-app
ios-app

వేధింపుల వార్తలపై మొదటి సారి స్పందించిన కృతీ శెట్టి!

  • Published Jul 07, 2023 | 12:38 PM Updated Updated Jul 07, 2023 | 12:38 PM
  • Published Jul 07, 2023 | 12:38 PMUpdated Jul 07, 2023 | 12:38 PM
వేధింపుల వార్తలపై మొదటి సారి స్పందించిన కృతీ శెట్టి!

ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువ కనిపిస్తున్నారు హీరోయిన్‌ కృతీ శెట్టి. ఆమె అన్నా అనకపోయినా.. కామెంట్లు చేసినా చేయకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె గురించి ఏదో ఒక వివాదం నడుస్తోంది. గత కొద్దిరోజుల నుంచి ఆమె గురించిన ఓ న్యూస్‌ తెగ వైరల్‌ అవుతోంది. అదేంటంటే.. సౌత్‌కు చెందిన ఓ స్టార్ హీరో కొడుకు కృతీ శెట్టిని వేధిస్తున్నాడట. తనతో ఫ్రెండ్ షిప్ చేయాలని నిత్యం ఫోన్లు చేసి వేధిస్తున్నాడట. అంతేకాకుండా తన బర్త్ డే పార్టీకి రావాలని గోల చేస్తున్నాడట.

అక్కడితో ఆగకుండా తనకు ఎంత కావాలంటే అంత డబ్బు కూడా ఇస్తానంటూ కామెంట్ చేశాడట. ఈ వార్తల నేపథ్యంలో మీడియాలో కృతీ శెట్టి పేరు మారుమోగిపోయింది. ఎవరా స్టార్‌ హీరో? కృతీ శెట్టిని వేధిస్తున్న అతడి కుమారుడు ఎవరు? అన్న చర్చ మొదలైంది. ఇక, ఈ వార్తలపై కృతీ శెట్టి తాజాగా స్పందించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ మీ ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయోద్దు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయోద్దు. నేను ఈ నిరాధారమైన తప్పుడు వార్తలను పట్టించుకోకూడదని మొదటి నుంచి అనుకుంటున్నా.

కానీ, అవి హద్దులు దాటుతుండటంతో స్పందించాల్సి వస్తోంది’’ అని పేర్కొన్నారు. కృతీ శెట్టి స్పందనతో పుకార్లకు బ్రేక్‌ పడిటన్లు అయింది. కాగా, కృతీ శెట్టి ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బాస్టర్‌ను అందుకున్నారు. తర్వాత తీసిన రెండు సినిమాలు కూడా హిట్లు అయ్యాయి. అయితే, గత కొంత కాలం నుంచి కృతీ శెట్టి ఖాతాలో హిట్లు లేకుండా పోయాయి. అవకాశాలు కూడా బాగా తగ్గాయి. అలాంటి సమయంలో  ఇలాంటి పుకార్లు ఆమెకు తలనొప్పిగా మారాయి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetbetosferjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetist