iDreamPost
android-app
ios-app

Game Changer: గేమ్ ఛేంజర్.. చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఇక బాక్సాఫీస్ ఊచకోతే..

  • Published Aug 28, 2024 | 7:48 PM Updated Updated Aug 28, 2024 | 7:48 PM

Ram Charan, Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం. అదే గనక నిజమైతే.. బాక్సాఫీస్ వద్ద చరణ్ ఊచకోత ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Ram Charan, Game Changer: రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం. అదే గనక నిజమైతే.. బాక్సాఫీస్ వద్ద చరణ్ ఊచకోత ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Game Changer: గేమ్ ఛేంజర్.. చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్! ఇక బాక్సాఫీస్ ఊచకోతే..

గేమ్ ఛేంజర్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు కచ్చితంగా తీసుకొస్తామని సందర్భం వచ్చిన ప్రతీసారి గట్టిగా చెబుతూ వస్తున్నాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు. తాజాగా మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆయన ఇదే విషయాన్ని మరోసారి చెప్పుకొచ్చాడు. అయితే డిసెంబర్ లో ఏ డేటో కచ్చితంగా మాత్రం చెప్పడం లేదు. ఆ డేట్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఓ గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం. అదే గనక నిజమైతే.. బాక్సాఫీస్ వద్ద చరణ్ ఊచకోత ఓ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్ తో దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినట్లు సమాచారం. ఇక డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి వస్తామని దిల్ రాజు ప్రకటించాడు. రిలీజ్ డేట్ ఫిక్స్ కాగానే ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదంతా కాసేపు పక్కనపెడితే.. తాజాగా ఓ న్యూస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇప్పటిదాకా.. క్రిస్మస్ రేసులో ఉన్న ఆమిర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ముంబై వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ లోపు షూటింగ్ తో పాటుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం అసాధ్యం అని మేకర్స్ అనుకుంటున్నారట. దాంతో హడావిడిగా రిలీజ్ చేయడం కంటే..నెమ్మదిగా రావడమే బెటర్ అని ఆమిర్ ఖాన్ భావిస్తున్నాడట.

good news for charan fans

కాగా.. ఇదే జరిగితే.. చరణ్ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే? ఈ మూవీ డ్రాప్ కావడంతో.. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న గేమ్ ఛేంజర్ కు హిందీ మార్కెట్ లో మరిన్ని థియేటర్లు దక్కే అవకాశాం ఉంది. దాంతో బాలీవుడ్ లో ఎక్కువ కలెక్షన్లు కొల్లగొట్టడానికి ఛాన్స్ లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సిస్ లో ముఫాసా ది లయన్ కింగ్ వల్ల థియేటర్ల సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఆమిర్ మూవీ డ్రాప్ కావడంతో.. బాక్సాఫీస్ వద్ద చరణ్ ఊచకోతకు ఎదురుండదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో పాటుగా మరో న్యూస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తుతోంది. వినాయక చవితి సందర్భంగా స్పెషల్ ట్రీట్ ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆ ట్రీట్ ఏంటా? అని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.