iDreamPost

కోమలి సిస్టర్స్‌ గుర్తున్నారా.. ఇప్పుడు గుర్తుపట్టలేని రేంజ్‌లో!

Komali Sisters Now.. బుల్లితెరపై తన మిమిక్రీతో అలరించిన కోమలి సిస్టర్స్ గుర్తున్నారా.. కొన్ని రోజుల పాటు తమ కామెడీతో కితకితలు పెట్టించిన ఆ సిస్టర్స్ .. ఇప్పుడు ఏం అయ్యారు... ఎలా ఉన్నారంటే..?

Komali Sisters Now.. బుల్లితెరపై తన మిమిక్రీతో అలరించిన కోమలి సిస్టర్స్ గుర్తున్నారా.. కొన్ని రోజుల పాటు తమ కామెడీతో కితకితలు పెట్టించిన ఆ సిస్టర్స్ .. ఇప్పుడు ఏం అయ్యారు... ఎలా ఉన్నారంటే..?

కోమలి సిస్టర్స్‌ గుర్తున్నారా.. ఇప్పుడు గుర్తుపట్టలేని రేంజ్‌లో!

టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని నిరూపించారు.. నిరూపిస్తున్నారు. ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్. ఒకరు తమ కామెడీ టైమింగ్‌తో కితకితలు పెట్టించగలరు. మరొకరు తమ నటనతో ఏడ్చిపించగలరు. కవ్వించగలరు. కానీ వీటికి ఓ వేదిక అవసరం. అది బుల్లి తెర అయినా, వెండి తెర అయినా. కొంత మంది టాలెంట్ ఉన్నా కూడా సరైన వేదిక లేక మరుగున పడిపోతుంటారు. కొంత మంది అవకాశాలను వెతుక్కుంటూ వెళుతూ సత్తా చాటుతున్నారు. బుల్లి తెర నుండి వెండి తెరపై రాణిస్తున్న ఎంతో మంది నటీనటులు,టెక్సీషియన్లు ఒకప్పుడు ఇలాంటి ఫ్లాట్ ఫామ్స్ కోసం ఎదురు చూసిన వాళ్లే. ఇదిగో ఇలా మిమిక్రీ టాలెంట్‌గా మలుచుకుని ఎదిగారు ఇద్దరు చిన్నారులు.

వాళ్లే కోమలి సిస్టర్స్. మిమిక్రీ అంటే మగవాళ్ల సొత్తుగా ఉండేది. కానీ ఆ హద్దులను చెరిపేశారు ఈ ఇద్దరు. చిన్న వయస్సులో అద్భుతమైన మిమిక్రీ చేసి కడుపుబ్బా నవ్వించారు . చిన్న చిన్న షోలతో కామెడీ  చేసి.. బుల్లితెరపై పలు షోలు చేశారు. అందరికి కోమలి సిస్టర్స్‌గానే పేరుంది. కానీ వీరి అసలు పేర్లు హీరోషిణీ కోమలి, దేవర్షిణీ కోమలి.. ఖమ్మంలో పుట్టి. హైదారాబాద్‌లో పెరిగిన ఈ కోమలి సిస్టర్స్ చిన్న వయస్సు నుండే మస్తు టాలెంట్ ప్రదర్శించారు. టీవీ 9లో కోమలి సిస్టర్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ కామెడీ షో కూడా నడిచేది అంటే ఆలోచించండి.. వీరంతా ఫేమస్సో. అయితే చదువుల పేరుతో కాస్త బ్రేక్ ఇచ్చారు కోమలి సిస్టర్స్. ఆ తర్వాత పెద్ద కోమలి హీరోషిణీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది.

ఆపై హీరోయిన్ అవ్వాలని భావించిన కోమలి.. ఫిల్మ్ మేకింగ్ కోర్సు తీసుకుని, నటనలో సత్యానంద్ దగ్గర మెలువలు తీసుకుంది. గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ, ఆ మూవీలో మెరిసిన ఈ అమ్మాయి.. 2019లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఉత్రాన్ అనే మూవీలో నటించింది. ఇందులో లిప్ లాక్ సీన్లతో రెచ్చిపోయింది. ఇక వైకల్యం అనే చిత్రంలోనూ నటించంది. ఇందులో హ్యాండికాప్ట్ గర్ల్‌గా కనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో ఉమా మహేశ్వరి పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కొత్త కథలను వింటున్నట్లు తెలుస్తోంది. ఇక తన విజయంలో సగ భాగంగా మారిన చెల్లి దేవర్షిణీ కూడా పెద్దదయ్యింది. అయితే ఆమెకు నటన మీద పెద్ద ఆసక్తి ఉన్నట్లు లేదు. ప్రస్తుతం ఆమె యుకేలో ఉన్నత చదువులు చదివి.. అక్కడే సెటిల్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు సోషల్ మీడియాలో తమ ఫోటోలతో రచ్చ రచ్చ చేస్తుంటారు. అక్కలాగే చెల్లె కూడా హీరోయిన్ మెటీరియల్. ఈ ఇద్దర్ని ఇప్పుడు చూస్తుంటే.. అప్పుడే అంత పెద్దోళ్లు అయిపోయారా అని అనిపించకమానదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి