iDreamPost
android-app
ios-app

Kanguva: సూర్యని మరోసారి ఆదుకున్న టాలీవుడ్! కంగువాకి మన దగ్గర కనకవర్షం!

  • Published Jul 08, 2024 | 3:14 PM Updated Updated Jul 08, 2024 | 3:14 PM

Kanguva Telugu Rights.. సూర్య నుండి రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ కంగువా. తమిళ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ అండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ దసరా సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

Kanguva Telugu Rights.. సూర్య నుండి రాబోతున్న అప్ కమింగ్ ప్రాజెక్ట్ కంగువా. తమిళ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ అండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మూవీ దసరా సందర్భంగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.

  • Published Jul 08, 2024 | 3:14 PMUpdated Jul 08, 2024 | 3:14 PM
Kanguva: సూర్యని మరోసారి ఆదుకున్న టాలీవుడ్! కంగువాకి మన దగ్గర కనకవర్షం!

కోలీవుడ్ ఇండస్ట్రీల్లో వర్సటైల్ హీరో అనడానికి ఫర్ ఫెక్ట్ యాక్టర్ సూర్య. కేవలం తమిళ తంబీలే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విపరీతంగా అభిమానించే నటుడు. ఇక్కడ సూర్యకు పెద్ద మార్కెట్ ఉంది. పితామగన్ (శివ పుత్రుడు) నుండి ఇంచు మించు అన్ని సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. గజినీతో తెలుగులో విపరీతమైన అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య.. సినిమా సినిమాకు డిఫరెంట్‌గా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. హిట్టు,ఫట్టులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో దూసుకెళుతున్నాడు. ఒక్కోసారి డౌట్ వస్తూ ఉంటుంది.. డిఫరెంట్ కథలు ఈయన్ను వెతుక్కుంటూ వస్తాయా..? లేక ఆ కథలు ఆయన కోసమే పుట్టాయా..? లేక విభిన్నంగా కనిపించాలని అతడే అలాంటి స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటాడా అని.? గజినీ నుండి ఇప్పుడు కంగువా వరకు చూస్తే ఇలాంటి అనుమనాలు కలుగుతుంటాయి.

రోల్ బాగుంటే చిన్న పాత్రకైనా వెనకాడనని నిరూపించాడు సూర్య. విక్రమ్, రాకెట్రీలో ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించిన సంగతి విదితమే. ఈటీ తర్వాత ఫుల్ లెంత్త్ రోల్‌లో కనిపించలేదు ఈ వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు కంగువా మూవీతో రాబోతున్నాడు. సూర్య కెరీర్‌లో అత్యంత బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. సుమారు రూ. 350 నుండి రూ. 500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్ నడుస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్నాడు. స్టూడియో గ్రీన్, యువీ క్రియేషన్స్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా, వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఈ మూవీ అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పటికే ఇంటెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇందులో సరికొత్త కాన్సెప్టుతో పాటు సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నాడు సూర్య.

సూర్యను ఢీకొట్టబోతున్నాడు యానిమల్ విలన్ బాబీ డియోల్. ఇక ఈ సినిమా రైట్స్ విషయానికి వస్తే.. ఏపీ, సీడెడ్, నిజాం హక్కులు కళ్లు చెదిరే రేటుకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు స్టేట్స్ హక్కులు ఏకంగా రూ. 25 కోట్లకు సొంతం చేసుకున్నారట డిస్ట్రిబ్యూటర్స్. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ కూడా ఎనౌన్స్ చేసింది. అయితే నైజాం హక్కులు రూ. 15 కోట్లకు కొనుగోలు చేసిందట మైత్రీ మూవీ మేకర్స్. ఆంధ్ర, సీడెడ్ రూ. 10 కోట్లు పెట్టినట్లు సమాచారం.  ఈ మూవీ తమిళ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా, అత్యంత ప్రతిష్టాత్మక తెరకెక్కుతోంది. ఈ మూవీ నిర్మాతల్లో టాలీవుడ్ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ ఒకటి కావడంతో పాటు సినిమా బడ్జెట్, సూర్య మార్కెట్ దృష్టిలో పెట్టుకుని ఈ రేట్స్ ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో దిశా పటానీ హీరోయిన్. బాబీ డియోల్, జగపతి బాబు,యోగి బాబు తదితరులు నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు సమకూరుస్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss