Dharani
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాంతో సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇంతకు ఏం జరిగింది అంటే..
Dharani
ఇండియా గర్వించదగ్గ నటుల్లో కమల్ హాసన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆయనకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వచ్చిన విక్రమ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపాడు కమల్ హాసన్. ప్రస్తుతం ఆయన సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించారు. కారణం పొలిటికల్ ఎంట్రీ. తమిళనాట కొత్త రాజకీయ పార్టీ స్థాపించి.. రాజకీయాల్లో రాణించాలని తీవ్రంగా కృషి చేస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రతి సారి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ క్యాంపెయిన్‌తో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకంది. ఆయన కుటుంబ సభ్యులు ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల హడావుడిలో ఉన్న కమల్‌హాసన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మామ, పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీనివాసన్ మృతి చెందారు. నిన్న అంటే సోమవారం నాడు కొడైకెనాల్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. శ్రీనివాసన్ వయస్సు 92 సంవత్సరాలు. పరమకుడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసన్.. ఒకప్పుడు ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. కొడైకెనాల్‌లో మృతి చెందిన శ్రీనివాసన్ భౌతికకాయాన్ని చెన్నైకి తీసుకొచ్చి ఆళ్వార్‌పేటలోని ప్రజా న్యాయ కేంద్రం ప్రధాన కార్యాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంగళవారం నాడు శ్రీనివాసన్ అంత్యక్రియలు నిర్వహించినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
శ్రీనివాస్ మృతిపై కమల్ హాసన్ స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా తన సంతాపం తెలిపాడు. తన వ్యక్తిత్వ వికాసంలో శ్రీనివాసన్ పాత్ర ఎంతో కీలకం అన్నారు. “నా వ్యక్తిత్వ వికాసంలో అంకుల్ ఆరుయిర్ శ్రీనివాసన్ పాత్ర మరువరానిది. వాసు మామ ఆలోచనలు విప్లవాత్మకంగా ఉండేవి.. ధైర్య సాహసాల విషయంలో ఆయన వీరోచిత వ్యక్తి. సోమవారం నాడు వాసు మామ మమ్మల్ని విడిచి వెళ్లారు. అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని సోమవారం రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకువచ్చాము. మంగళవారం నాడు.. బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు చేశాము’’అని పోస్ట్ చేశాడు.
ఇక కమల్ హాసన్ మామ మృతి పట్ల ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. ఈ క్రమంలో మంత్రి ఉదయనిధి శ్రీనివాసన్ మృతిపై స్పందిస్తూ.. ‘‘శ్రీనివాసన్ మృతి చెందారని తెలిసి మేం చాలా బాధపడ్డాము. కళైజ్ఞాని కమల్ హాసన్ సర్‌కు సినీ ప్రపంచంలో, రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీ శ్రీనివాసన్ మరణం ఆయన కుటుంబానికి తీరని లోటు. కమల్ సర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. శ్రీనివాసన్ మృతిపై మరి కొందరు ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
எனது ஆளுமை உருவாக்கத்தில் பெரும்பங்கு வகித்த ஆருயிர் மாமா சீனிவாசன் இன்று தன்னுடைய 92-வது வயதில் கொடைக்கானலில் காலமானார். புரட்சிகரமான சிந்தனைகளுக்காகவும், துணிச்சலான செயல்களுக்காகவும் உறவினர்கள் நண்பர்கள் மத்தியில் ஒரு வீரயுக நாயகனாக திகழ்ந்தவர் வாசு மாமா.
இறுதி மரியாதை… pic.twitter.com/7CxY6XeWYs
— Kamal Haasan (@ikamalhaasan) April 22, 2024