iDreamPost
android-app
ios-app

Kamal Hasan: కల్కిపై కమల్ హాసన్ లీక్! ప్రభాస్ ఫ్యాన్స్ కి భలే ట్విస్ట్ ఇచ్చాడు!

  • Published Mar 25, 2024 | 2:52 PM Updated Updated Mar 25, 2024 | 2:52 PM

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "కల్కి 2898 AD". ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కమల్ హాసన్ కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా "కల్కి 2898 AD". ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కమల్ హాసన్ కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 25, 2024 | 2:52 PMUpdated Mar 25, 2024 | 2:52 PM
Kamal Hasan: కల్కిపై కమల్ హాసన్ లీక్! ప్రభాస్ ఫ్యాన్స్ కి భలే ట్విస్ట్ ఇచ్చాడు!

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “కల్కి 2898 AD” చిత్రం షూటింగ్ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్యన రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా దిశా పటాని నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఎన్నో అప్ డేట్స్ ఎప్పటికపుడు .. సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. దీనితో రోజు రోజుకి ఈ కల్కి సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై కూడా కొన్ని చర్చలు జరిగాయి కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఏ క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ కల్కి సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ షికార్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మకమైన సినిమా కల్కిలో..స్టార్ యాక్టర్ కమల్ హాసన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో అభిమానులు ప్రభాస్ – కమల్ మధ్య వచ్చే సీన్స్ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ కల్కి సినిమాలో తన పాత్ర గురించి .. కొన్ని ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈ సినిమాలో కేవలం గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపించనున్నట్లు వెల్లడించారు. చాలా మంది ఈ సినిమాలో కమల్ విలన్ పాత్రలో నటిస్తున్నారేమో అనే ఊహల్లో ఉన్నారు. కానీ, కమల్ మాత్రం గెస్ట్ రోల్ లోనే నటించారట. అంటే ఇంచు మించు విక్రమ్ సినిమాలో వచ్చే రోలెక్స్ పాత్రల ఉండొచ్చేమో అని అభిమానులు అంచనా వేస్తున్నారు. సో దీనిపై కమల్ అయితే క్లారిటీ ఇచ్చారు. కానీ, అతని పాత్ర ఏమై ఉంటుందో మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి.

ఇక కల్కి సినిమాలో అందరు ప్రముఖ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ తో పాటు .. అమితా బచ్చన్ కూడా ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. చివరిగా ఈ చిత్రాన్ని మే 9 న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించిన మేకర్స్ కు.. ఎన్నికల కారణంగా ఓ సవాల్ ఎదురయ్యింది. అనుకున్న ప్రకారం ఈ సినిమా విడుదల ఉంటుందా లేదా అన్న విషయంపై మాత్రం.. ఎటువంటి క్లారిటీ లేదు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేతిలో వరుసగా రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి . కాబట్టి ప్రభాస్ తన అభిమానులను ఎక్కడ నిరాశ పరచకుండా ఉండేందుకు వరుస సినిమాలతో రెడీ గా ఉన్నాడు. మరి, కల్కి సినిమాపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet