భారతీయుడు 2 పై కాంట్రవర్సీ! నేను అలా అనలేదు : కమల్ హాసన్

Kamal Haasan Clarity: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చాలా ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ వస్తుంది.

Kamal Haasan Clarity: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. చాలా ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ వస్తుంది.

బారతీయ చలన చిత్ర రంగంలో విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటుడు, దర్శకుడు, నిర్మాత, డ్యాన్సర్ ఇలా అన్ని రంగాల్లో తనదైన మార్క్ చాటుకున్న కమల్ హాసన్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాను నటించే పాత్రల కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. 1996 లో ఎస్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’ అద్భుతమైన విజయం అందుకుంది. లంచం తీసుకోవడం.. ఇవ్వడం నేరం అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం ఒక ట్రెండ్ సృష్టించింది. వీరిద్దరి కాంబోలో భారతీయుడు 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీతో ఓ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు కమల్ హాసన్. వివరాల్లోకి వెళితే..

విశ్వనటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు రెడ్ జెయింట్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించిన మూవీ ‘భారతీయుడు2’. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ‘భారతీయుడు’ మూవీకి సీక్వెల్ గా రూపొందింది ఈ మూవీ. వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జులై 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్దమయ్యారు చిత్ర యూనిట్. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్ ప్లానింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, గ్లింప్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ మూవీ గురించి కమల్ చేసిన వ్యాఖ్యలపై కాంట్రవర్సీ చెలరేగింది. తాజాగా ఆ విషయంపై కమల్ క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల సింగపూర్ వెళ్లిన కమల్ హాసన్ అక్కడ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. తనకు భారతీయుడు 2 కన్నా భారతీయుడు 3 ఎక్కవ నచ్చిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై నటిజన్లు మరోలా అర్థం చేసుకొని భారతీయుడు 2 మూవీ అంతగా బాగాలేదేమో.. అందుకే కమల్ ఆ మాట అన్నాడని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఈ విషయంపై కమల్ హాసన్ క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శంకర్, నటుడు సిద్దార్థ్ పాల్గొన్నారు. కమల్ తాను చేసిన వ్యాఖ్యల గురించి క్లారిటీ ఇస్తూ.. నేను మాట్లాడిన మాటలు కొందరు మరో కోణంలో అర్థం చేసుకున్నారు. భారతీయుడు రెండో పార్ట్ కంటే మూడో పార్ట్ బాగా నచ్చిందని చెప్పా. అలా అని రెండో భాగం బాగాలేదని కాదు.. సాంబారు, రసంతో ఇష్టంగా భోజనం చేస్తాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపిస్తుంటాం.. అలాగే కొన్ని అంశాల్లో భారతీయుడు మూడో భాగం నన్ను ఆకట్టుకుందని ’ చెప్పాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

 

Show comments