iDreamPost
android-app
ios-app

కమల హాసన్ ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రెడీ..

  • Published May 17, 2025 | 11:29 AM Updated Updated May 17, 2025 | 11:29 AM

‘థగ్ లైఫ్’ సినిమా మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ విషయాలు చూసేద్దాం.

‘థగ్ లైఫ్’ సినిమా మీద అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి .ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ విషయాలు చూసేద్దాం.

  • Published May 17, 2025 | 11:29 AMUpdated May 17, 2025 | 11:29 AM
కమల హాసన్ ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రెడీ..

యూనివెర్సల్ హీరో కమల్ హాసన్ నుంచి సినిమా వస్తుందంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం కమల్ హాసన్ నటిస్తున్న మూవీ థగ్ లైఫ్ . ఈ సినిమాలో కమల్ హాసన్ , త్రిష , శింబు లాంటి ఎంతో మంది స్టార్ నటీనటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ , టీజర్ అన్ని కూడా అంతు చిక్కకుండానే ఉన్నాయి. అసలు ప్లాట్ ఏంటో తెలియాలంటే ఈ సినిమా ట్రైలర్ చూడాల్సిందే. మరో వైపు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

మే 17 సాయంత్రం 5 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఒకసారి ట్రైలర్ చూస్తే ఇక సినిమా ప్లాట్ ఏంటి అనేది ప్రేక్షకులకు అర్ధమౌతుంది. ఇక కమల హాసన్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. కాగా ఈ సినిమాను జూన్ 5 న గ్రాండ్ గా థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా.. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ , మద్రాస్ టాకీస్ వారు నిర్మాణం వహించారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి. రిలీజ్ తర్వాత కూడా ఇదే అంచనాలు ఉంటాయా లేదా అనేది చూడాల్సి ఉంది. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.