iDreamPost
android-app
ios-app

సిద్దార్థ్‌తో పెళ్లి విషయాలు బయట పెట్టిన అదితీ హైదరీ

  • Published Aug 30, 2024 | 7:00 PM Updated Updated Aug 30, 2024 | 7:00 PM

సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిశితార్థం చేసుకున్నారు. మహా సముద్రం మూవీలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిన సంగతి విదితమే. అయితే తాజాగా కొన్ని పెళ్లి ముచ్చట్లు పంచుకుంది హైదరీ.

సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిశితార్థం చేసుకున్నారు. మహా సముద్రం మూవీలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారిన సంగతి విదితమే. అయితే తాజాగా కొన్ని పెళ్లి ముచ్చట్లు పంచుకుంది హైదరీ.

  • Published Aug 30, 2024 | 7:00 PMUpdated Aug 30, 2024 | 7:00 PM
సిద్దార్థ్‌తో పెళ్లి విషయాలు బయట పెట్టిన అదితీ హైదరీ

టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు సిద్దార్థ్, అదితి రావ్ హైదరీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిశితార్థం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని ఓ ఆలయంలో అత్యంత రహస్యంగా ఈ వేడుక జరిగింది. ఆ తర్వాత ఫోటోలను షేర్ చేసుకున్నారు ఈ ఇద్దరు. మహా సముద్రం షూటింగ్ సమయంలో సిద్దార్థ్‌తో ఏర్పడిన పరిచయం.. ప్రేమకు దారి తీసింది. కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు తాజాగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. అయితే తాజాగా ఆమె కొన్ని పెళ్లి, పర్సనల్ ముచ్చట్లు పంచుకుంది అదితి. తనకు నాన్నమ్మ అంటే చాలా ఇష్టమని చెప్పిన అమ్మడు..స్కూల్లో సిద్దార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని చెప్పింది. పెళ్లి ఎక్కడ జరగబోయేది అనే విషయాలు తెలియజేసింది. అయితే పెళ్లి డేట్ మాత్రం ప్రకటించలేదు.

‘మా నాన్నమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని విషయాలు ఆమెతో షేర్‌ చేసుకునేదాన్ని. హైదరాబాద్‌లో మాకొక స్కూల్ ఉంది. అది నాకెంతో ప్రత్యేకం. నేను చిన్నప్పుడు అక్కడే ఉండేదాన్ని. కొన్నేళ్ల క్రితం ఆమె కన్నుమూశారు. ఈ విషయం సిద్ధార్థ్‌కు తెలుసు. ఓ రోజు నా వద్దకువచ్చి.. ఆ స్కూల్‌కు తీసుకువెళ్లమని అడిగాడు. మార్చిలో మేమిద్దరం అక్కడికి వెళ్లాం. మోకాళ్లపై కూర్చొని.. సిద్దార్థ్ నాకు ప్రపోజ్‌ చేశాడు. ఆమె ఆశీస్సుల కోసమే తాను అక్కడ ప్రపోజ్‌ చేసినట్లు చెప్పాడు’ అని అదితి తెలిపింది. అతను ప్రేమను వ్యక్తపరిచిన తీరు తనకెంతో నచ్చిందన్నారు. తమ పెళ్లి శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో జరుగుతుందని చెప్పారు. ఆ దేవాలయం తమకెంతో స్పెషల్ అని చెప్పిన అమ్మడు.. పెళ్లి అక్కడే ఉంటుందని చెప్పారు. తేదీ ఖరారయ్యాక ప్రకటిస్తామని తెలిపింది.

కాగా, గతంలో రహస్యంగా నిశితార్థం చేసుకున్న వ్యాఖ్యలపై సిద్దార్థ్ స్పందిస్తూ.. సీక్రెట్, ప్రైవేట్ అనే పదాలకు వ్యత్యాసం ఉందని, తమ ఎంగేజ్‌మెంట్‌కు ఎవరినైతే పిలవలేదో వాళ్లు మాత్రమే దీనిని సీక్రెట్‌ ఫంక్షన్‌గా భావిస్తున్నారని, నిజం చెప్పాలంటే, ఇది కుటుంబసభ్యుల సమక్షంలో జరిగిన ప్రైవేట్‌ ఫంక్షన్‌ అని పేర్కొన్నాడు. కాగా, ఈ ఇద్దరికీ ఇది రెండవ వివాహం కావడం విశేషం. సిద్దార్థ్ 2003లో మేఘనా నారాయణ్‌ని వివాహం చేసుకుని నాలుగేళ్లకు విడాకులిచ్చాడు. అదితీ కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడ్ని 2009లో వివాహం చేసుకుంది. 2013లో ఈ జంట విడిపోయారు. హీరా మండితో పలకరించిన ఈ బ్యూటీ రెండు చిత్రాలు చేస్తుంది. సిద్దార్థ్ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş