iDreamPost
android-app
ios-app

వీడియో: విజయ్ గురించి నాగ్ అశ్విన్ ఎమోషనల్ కామెంట్స్.. నా ప్రతి మూవీలో ఉంటాడు!

  • Published Jul 04, 2024 | 5:09 PM Updated Updated Jul 04, 2024 | 5:09 PM

కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అర్జునుడి లాంటి పవర్ ఫుల్ పాత్రలో విజయ్ కి ఇచ్చి కామెడీ చేశారంటూ కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అర్జునుడి లాంటి పవర్ ఫుల్ పాత్రలో విజయ్ కి ఇచ్చి కామెడీ చేశారంటూ కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

  • Published Jul 04, 2024 | 5:09 PMUpdated Jul 04, 2024 | 5:09 PM
వీడియో: విజయ్ గురించి నాగ్ అశ్విన్ ఎమోషనల్ కామెంట్స్.. నా ప్రతి మూవీలో ఉంటాడు!

ప్రస్తుతం ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ దేశంలో బాక్సాపీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించారు.అయతే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గత నెల జూన్ 27వ తేదీన గ్రాండ్ థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే.అయితే విడుదలైన తొలి రోజు నుంచే మంచి కల్కి మంచి హిట్ టాక్ తో దూసుకుపోవడమే కాకుండా.. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. కాగా, ఇప్పటి వరకు ఈ సిినమా రూ.700 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ ను వసూలు చేసింది.ఇక ఈ విషయం పక్కన పెడితే.. కల్కి మూవీ విడుదలైన దగ్గర నుంచి అందరీ కళ్లు దర్శకుడు నాగ్ అశ్విన్ మీదే ఉన్నాయి. ఎందుకంటే.. ఈతరం యువతకు మహాభారతాన్ని కళ్లముందే అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. దీంతో ఇటు ప్రేక్షకులతో పాటు ప్రభాస్ అభిమానులు కూడా నాగీని ప్రశంసలతో ముంచేతెత్తున్నారు.అంతేకాకుండా.. ఎక్కడ చూసిన నాగ్ అశ్విన్ గురించే చర్చించుకుంటున్నారు. అంతలా కల్కి సినిమాను గొప్పగా తీర్చిదిద్దడమే కాకుండా.. తెలుగు సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాడు నాగ్ అశ్విన్.

ఇదిలా ఉంటే. కల్కి మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అర్జునుడి లాంటి పవర్ ఫుల్ పాత్రలో విజయ్ కి ఇచ్చి కామెడీ చేశారంటూ కొంతమంది నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా.. విజయ్ దేవరకొండ అర్జునుడు గెటప్ ఓకే అనిపించినా, వాయిస్ విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ రూమర్స్ కు చెక్ పెడుతూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ విజయ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశాడు.కాగా,ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Nag Aswin

ఇంతకి నాగ్ అశ్విన్ ఏమన్నారంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘విజయ్ దేవరకొండనా బెస్ట్ ఫ్రెండ్. ఆయన నా ప్రతి సినిమాలో హీరోగా చేస్తే హ్యాపీ. ఒకవేళ అలా కుదరకపోతే తన కోసం ఏదో ఒక స్పెషల్ రోల్ క్రియేట్ చేస్తాను. అలా నా ప్రతి సినిమాలో విజయ్ ఉంటాడు’ అంటూ తమ స్నేహం గురించి నాగ్ అశ్విన్ గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇక నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో నెటిజన్న్ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ఫ్రెండ్ షిప్ అంటే మీది అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో విజయ్ దేవరకొండ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఎవడె సుబ్రహ్మణ్యం,మహానటి సినిమాల్లో కూడా నటించిన విషయం తెలిసిందే. మరి, విజయ్ గురించి నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİ