iDreamPost
android-app
ios-app

డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పటినుంచే!

  • Published Jun 03, 2024 | 11:32 AM Updated Updated Jun 03, 2024 | 11:32 AM

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి 2898 ఏడీ మూవీ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఆరోజు నుంచే ప్రారంభం అని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. కల్కి 2898 ఏడీ మూవీ అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్ ఆరోజు నుంచే ప్రారంభం అని మూవీ మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

డార్లింగ్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘కల్కి’ అడ్వాన్స్ బుకింగ్స్ అప్పటినుంచే!

‘కల్కి 2898 AD’ ఇండియన్ సినిమా ఇండస్ట్రీతో పాటుగా హాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఈ చిత్రం కొరకు వేచిచూస్తున్నారు. కల్కి షూటింగ్ ప్రారంభం నుంచే భారీ హైప్ ను క్రియేట్ చేస్తూ వస్తోంది. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్, దీపికా లాంటి  బిగ్ స్టార్స్ అందరూ ఒకే చిత్రంలో కలిసి నటిస్తుండటంతో.. ప్రేక్షకుల్లో ఎక్కడాలేని ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచి అవుతాయి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ బుక్కింగ్స్ ఆ రోజు నుంచే ప్రారంభం అని ఓ ప్రకటనలో తెలిపింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ గా నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ తుదిమెరుగులు దిద్దుకుంటోంది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న కల్కి మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూవీ టీమ్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చి.. ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. కల్కి చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ డేట్ ను ఫిక్స్ చేసింది. ఈ మేరకు మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు.

'Kalki' Advance Bookings From Now!

కల్కి చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ జూన్ 7 నుంచి ప్రారంభం కానున్నాయని  మూవీ టీమ్ తెలిపింది. ఇక యూఎస్ఏలో జూన్ 8న లేదా అంతకంటే ముందే బుకింగ్స్ స్టార్ట్ అవుతాయని ప్రకటించింది. దాంతో డార్లింగ్ అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు. ఎప్పుడెప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా? టికెట్స్ బుక్ చేసుకుందామా? అని వేయి కళ్లతో చూస్తున్నారు. రూ. 600 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో కల్కి తెరకెక్కిన విషయం తెలిసిందే. హాలీవుడ్  తరహా టేకింగ్ తో డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదరగొట్టాడు.

కాగా.. కల్కి మూవీ రన్ టైమ్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కల్కి రన్ టైమ్ దాదాపు 2 గంటల 50 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా తెలుగు సినిమాలు రెండు నుంచి రెండున్నర గంటల్లో పూర్తి అవుతాయి. అలాంటి కల్కి దాదాపు మూడు గంటల రన్ టైమ్ కలిగి ఉందన్న వార్త అభిమానులను సంతోషానికి గురిచేస్తోంది. మేకర్స్ సైతం నిడివి గురించి ఎలాంటి భయం లేదని, ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని చెప్పుకొస్తోంది. ఇక మూవీ టీమ్ ప్రమోషన్స్ ను ఇప్పటికే స్టార్ట్ చేసింది. బుజ్జి-భైరవ కాన్సెప్ట్ తో చిన్న పిల్లలను కూడా ఎట్రాక్ట్ చేసే పనిలో పడింది. అందులో భాగంగానే సెలబ్రిటీల పిల్లలకు గిఫ్ట్ లు పంపిస్తోంది.