P Krishna
Kalki 2898 AD Movie: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుంది. బాహుబలి నుంచి మొదలైన రికార్డుల పర్వం ఇంకా కొనసాగుతుంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది.
Kalki 2898 AD Movie: తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుంది. బాహుబలి నుంచి మొదలైన రికార్డుల పర్వం ఇంకా కొనసాగుతుంది. విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది.
P Krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి.. కానీ కొన్ని సినిమాలు మాత్రమే రికార్డుల పరంపర కొనసాగించాయి. అలాంటి చిత్రాల్లో ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ’ చేరింది. రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డుల మోత మొదలు పెట్టింది. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. అన్ని భాషల్లో వసూళ్లు పరంపర కొనసాగిస్తుంది. రిలీజ్ అయిన మూడో వారం కూడా అదో జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ భారీ వసూళ్లు దిశకంగా సాగుతుంది. అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా మరో రికార్డు క్రియేట్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ‘కల్కి 2998 ఏడి’ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు దాటి ‘కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ప్రభంజనం సృష్టిస్తుంది.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ కెరీర్‌లో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన మరో సినిమా ‘కల్కి 2998 ఏడి’. అంతేకాదు ఈ మూవీ ఉత్తర అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన ఇండియన్ రెండో సినిమాగా నిలిచింది. అక్కడ 17 రోజుల్లో 17.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. గతంలో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ 17.49 మిలియన్ సాధించగా ఇప్పుడు ఆ రికార్డు దిశగా కల్కి మూవీ వసూళ్లు రాబడుతుంది. అయితే బాహుబలి – 2 (20.7 మిలియన్) రాబట్టి అగ్ర స్థానంలో కొనసాగుతుంది.
‘కల్కి 2998 ఏడి’ 1000 కోట్ల క్లమ్ లో చేరినట్లు ఇప్పటికే మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ కర్ణుడి పాత్రకు సంబంధించిన పోస్టర్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. సౌత్ హీరోల్లో 1000 కోట్టకు పైగా కలెక్షన్లు రెండు సార్లు సాధించిన ఏకైక హీరో ప్రభాస్ కావడం మరో విశేషం. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి, బాహుబలి 2’ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టించింది. భారతీ చిత్రాలు.. అందులోనూ టాలీవుడ్ చిత్రానికి ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టి అప్పట్లో రికార్డు మోత మోగించింది. కల్కీ బాక్సాఫీస్ రికార్డును సొంతం చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ‘కల్కి’ సీక్వెల్ పై ఉంది.. మరి అదెన్ని కోట్లు వసూళ్లు చేసి ఏన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ప్రభాస్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.