iDreamPost
android-app
ios-app

కల్కి మెగా షెడ్యూల్ సిద్ధం! అంచనాలతో చంపేస్తారా స్వామి?

  • Published Feb 04, 2024 | 12:47 PM Updated Updated Feb 04, 2024 | 12:47 PM

ప్రభాస్ నుండి రాబోతున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కల్కి. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

ప్రభాస్ నుండి రాబోతున్న మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కల్కి. మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ వచ్చింది.

  • Published Feb 04, 2024 | 12:47 PMUpdated Feb 04, 2024 | 12:47 PM
కల్కి మెగా షెడ్యూల్ సిద్ధం! అంచనాలతో చంపేస్తారా స్వామి?

ప్రభాస్ రేంజ్ బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత అన్నట్లుగా మారింది. పాన్ ఇండియా కాదూ పాన్ వరల్డ్ హీరోగా మారిపోయాడు డార్లింగ్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ యావరేజ్ టాక్ తెచ్చుకుంటేనే కోట్ల కురిపించాయి.. హిట్ టాక్ పడితే.. ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయో మరోసారి నిరూపించాడు సలార్ మూవీతో ఈకటౌట్. అతడి ఖాతాలో క్రేజీ మూవీస్ ఉన్నాయి. ప్రభాస్ చేస్తున్న మూవీల లైనప్ చూస్తుంటే.. కళ్లు చెదురుతున్నాయి. కల్కి, రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఇటీవల కాలంలో అన్ని జోనర్లను టచ్ చేసిన హీరోగా మారాడు అమ్మాయి కలల రాకుమారుడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.

సలార్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్.. ఇప్పుడు తన టైంని కల్కి 2898 ఏడీ కోసం కేటాయిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగబోతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరగబోతుంది. ఈ సినిమా కీలక పాత్ర పోషిస్తున్న స్టార్స్.. ఇందులో భాగం కానున్నారు. అమితాబ్, కమల్, దీపిక ఈ మెగా షెడ్యూల్లో పాల్గొననున్నారని సమాచారం. సుమారు 600 కోట్లతో భారతీయ ఇతి హాస గాధలకు సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇండస్ట్రీలో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వైజయంతి మూవీస్.. కల్కి మూవీని అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా భావిస్తుంది. అందుకే నిర్మాణ వ్యయంలో ఎక్కడా రాజీ పడటం లేదని టాక్.

మే 9న సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఆరోజుకో స్పెషల్ ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన జగదీక వీరుడు.. అతిలోక సుందరి, మహానటి, మహార్షి వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్ ఆ తేదీనే విడుదలయ్యాయి. అందుకే ఆ రోజునే ఈ మూవీని విడుదల చేయాలన్న ప్లాన్‌లో ఉన్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఇటు షూటింగ్.. అటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమాంతరంగా జరగుతుందని సమాచారం. ఇక ఈ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇందులో స్పెషల్ రోల్స్ చేస్తున్నారట స్టార్ హీరోస్. రానా, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, ఎన్టీఆర్, నాని వంటి టాలీవుడ్ స్టార్ హీరోలు యాక్ట్ చేయబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

ఇక ఈ సినిమాలో దీపిక, దిశా పటానీ వంటి బాలీవుడ్ బ్యూటీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంతోష్ నారాయణన్ బాణీలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్.. రెస్పాన్స్ రావడంతో పాటు అంచనాలను మించిపోయాయి. అలాగే ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీగా ఖర్చుపెట్టి దక్కించుకుందట ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. ఈ సమాచారంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మరీ ఈ సినిమాను చూసేందుకు మీరు రెడీగా ఉన్నారా..?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet