iDreamPost
android-app
ios-app

పుష్ప 2లో జాన్వీ కపూర్ హాట్ ఐటెమ్ సాంగ్

  • Published Mar 18, 2024 | 11:46 AM Updated Updated Mar 18, 2024 | 11:46 AM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినన పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత నటించి మంచి పాపుల్యారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప ద రైజ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కు కోసం దర్శకుడు సుకుమార్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించినన పుష్ప సినిమాలో ఐటెమ్ సాంగ్ కు స్టార్ హీరోయిన్ సమంత నటించి మంచి పాపుల్యారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప ద రైజ్ సినిమాలో ఐటెమ్ సాంగ్ కు కోసం దర్శకుడు సుకుమార్ ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది.

  • Published Mar 18, 2024 | 11:46 AMUpdated Mar 18, 2024 | 11:46 AM
పుష్ప 2లో జాన్వీ కపూర్ హాట్ ఐటెమ్ సాంగ్

పుష్ప ద రైజ్ లో సమంత చేసిన ఊ అంటావా ఐటెమ్ సాంగ్ మొత్తం భారతదేశాన్నే ఊపేసింది. బాలీవుడ్ నటీనటులు కూడా ఈ పాటను హమ్ చేసుకుని, ఇంటర్వ్యూల్లో కూడా పాఢేశారు. మొన్నీ మథ్యన జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో కూడా ఈ పాట పెద్ద చర్చే జరిగిపోయింది. ఊ అంటావా గురించి సమంత సుదీర్ఘంగా చెప్పవలసి వచ్చినంత పాప్యులారిటీనీ పాట సమంతకి తీసుకొచ్చిన మాట ఎవ్వరూ కాదనలేనిది. ఇంక ఊ అంటావా లాటి సెక్సీ ఐటెమ్ సాంగ్స్ మరి చెయ్యాల్సిన అవసరం తనకి లేదని, తనేంటో ఈ పాటతో ప్రూ చేసేసుకున్నానని సమంత సగర్వంగా చెప్పుకుంది.

అయితే ఇలాటి మేజిక్కేదో పుష్ఫ 2లో కూడా రిపీట్ చేయాలనే సంకల్సంతో దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు ఇద్దరు ముగ్గుర్ని సంప్రదించారు కూడా. అందులో ముఖ్యంగా ఇటీవల సినిమాల మీద సినిమాలు చేసేస్తూ, ఫ్లాపుల మీద ఫ్లాపులు పోగుచేసుకుంటున్న శ్రీ లీలని కూడా అడిగారు దర్శక నిర్మాతలు. కానీ బ్లంట్ గా చేయనని చెప్పేసింది శ్రీ. ఎందుకంటే గుంటూరు కారం సినిమాతో వచ్చిన సాలిడ్ పాప్యులారిటీని పాడు చేసుకోవడం ఇష్టం లేకనే శ్రీ ఒప్పుకోలేదని అంటున్నారు. కానీ ఇటువంటి పాటని, పుష్ఫ 2లాటి మైఠీ ప్రాజెక్టులో చేయడం వల్ల వచ్చే మైలేజ్ ని ఈ అమ్మడు అంచనా కట్టలేకపోయింది. మధ్యలో ఒకటి తర్వాత మరొక ఫ్లాపు రాగానే కలవరపడి, ఐటెమ్ సాంగుకి నో అని చెప్పి కూర్చుంది.

Pushpa2

ఇప్పుడా గోల్డెన్ ఛాన్స్ మన అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కొట్టేసింది. ఎందుకంటే నార్త్ బెల్టులో ఊ అంటావా సాంగ్ ఎలాటి ఊపు ఊపిందో బాలీవుడ్ ఇండస్ట్రీకి, అక్కడి నటీనటులకి మాత్రమే తెలుసు. అందుకు జాన్వీ అడగ్గానే మారుమాట్లాడకుండా చిటికెలో ఓకే చేసేసింది. తాను ఓ పక్కన జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ డైరెక్షన్లో దేవర లాటి పెద్ద సినిమా చేస్తున్నా, బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ తో ఆర్ సి 16కి కమిట్ అయినా కూడా పుష్ఫ 2లో ఈ అవకాశాన్ని మాత్రం వదులుకోవడానికి జాన్వీ సిద్ధపడలేదు. దేని పాప్యులారిటీ దానిదే. ముఖ్యంగా సుకుమార్ తీసే విధానం, అల్లు అర్జున్ కి ఉన్న ఇండియా వైడ్ పాప్యులారిటీ, ఫేన్ ఫాలోయింగ్……ఒక్క మాటలో చెప్పాలంటే ఫీవర్ తో వచ్చే పుష్ఫ 2లో ఐటెమ్ సాంగ్ చేస్తే దాని విస్ఫోటనం ఎన్ని సినిమాలు చేసినా రాదు. బాలీవుడ్ ప్రొఫెషనలిజమ్ అటువంటిది. ఇవ్వాళ రేపు కావాల్సింది హల్ ఛల్. దాని గురించి బాలీవుడ్ భామలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన సౌత్ ముద్దుగుమ్మకి ఈ లెక్క అర్ధం కాలేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetvbettr girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş