iDreamPost
android-app
ios-app

Rashmi: పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ రష్మీ! అబ్బాయి ఎవరో గెస్ చేయలేరు!

  • Published Apr 01, 2024 | 4:04 PM Updated Updated Apr 01, 2024 | 4:04 PM

బుల్లితెర కామెడీ షోల్లో ఒకటైన ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకరమ్మ రష్మీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుందట. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందని సమాచారం. వరుడు ఎవరంటే..?

బుల్లితెర కామెడీ షోల్లో ఒకటైన ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకరమ్మ రష్మీ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుందట. త్వరలో ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందని సమాచారం. వరుడు ఎవరంటే..?

  • Published Apr 01, 2024 | 4:04 PMUpdated Apr 01, 2024 | 4:04 PM
Rashmi: పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ రష్మీ! అబ్బాయి ఎవరో గెస్ చేయలేరు!

యాంకర్ రష్మీ గౌతమ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు దశాబ్దకాలంగా వెండితెర, బుల్లితెర మీద రాణిస్తోంది. సినిమాలు చేస్తూనే.. యాంకరింగ్ కంటిన్యూ చేస్తోంది. ఇక సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె పెట్ లవర్ అన్న సంగతి అందరికి తెలుసు. నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది. ఇక రష్మీ పేరు వచ్చిందంటే.. కచ్చితంగా సుధీర్ పేరు రావాల్సిందే. అంతలా వీరి జోడి పాపులర్ అయ్యింది. నిజ జీవితంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారు ఎందరో. ఈ జంటకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదలా ఉంచితే తాజాగా రష్మీకి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..

దాదాపు దశాబ్దం కాలం పాటు యాంకర్‌గా, హీరోయిన్‌గా  ఇండస్ట్రీలో రాణిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది రష్మీ. కెరీర్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ తర్వలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందట. అమెరికా అబ్బాయితో రష్మీ పెళ్లి ఫిక్స్ అయ్యిందనే వార్త వైరల్ అవుతుంది. తాజాగా వీరిద్దరి జాతకాలు కూడా చూపించారట. త్వరలోనే పెళ్లి పై ప్రకటన వస్తుందని సమాచారం. ఎన్టీవీలో ఈ మేరకు వార్త ప్రచురితం అయ్యింది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Rashmi Gautham

రష్మీ పెళ్లి వార్త తెలిసి ఆమె ఫ్యాన్స్ సంతోషిస్తుంటే.. సుధీర్ అభిమానులు మాత్రం తెగ ఫీలవుతున్నారు. అంటే మా సుధీర్‌ను విడిచిపెట్టి అమెరికా వెళ్తావా అని కామెంట్స్ చేస్తున్నారు. మీ ఇద్దరి జోడి తెర మీద మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఎంతో క్యూట్ గా ఉంటుంది.. మీరు ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే రష్మీ పెళ్లి చేసుకుంటే అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయిన ఈ అమ్మడు ఆ షోలో కమెడియన్ సుధీర్ తో ప్రేమాయణం నడిపిందనే వార్తలు ఒకప్పుడు బాగా వినిపించాయి. కానీ తామిద్దరం కేవలం స్నేహితులమని.. షో కోసం అలా కలిసి నటిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రష్మీ యాంకరింగ్, సినిమాలతో బిజీగా ఉంది. సుధీర్ కూడా హీరోగా రాణించే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొన్నాళ్ల క్రితమే కాలింగ్ సహస్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom