iDreamPost
android-app
ios-app

రూ. 30 కోట్ల ఖర్చుతో.. రూ. 500 కోట్ల సినిమాలా ఎలా తీశారు..? హనుమాన్ సీక్రెట్

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం హనుమాన్. జనవరి 12న విడుదలై ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసేస్తుంది. తొలి రోజే మంచి కలెక్షన్లను కొల్లగొట్టిందీ చిత్రం. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన.. భారీ వసూళ్లను కొల్లగొట్టడం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే..?

తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం హనుమాన్. జనవరి 12న విడుదలై ఈ మూవీ బాక్సాఫీసును షేక్ చేసేస్తుంది. తొలి రోజే మంచి కలెక్షన్లను కొల్లగొట్టిందీ చిత్రం. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన.. భారీ వసూళ్లను కొల్లగొట్టడం వెనుక అసలు సీక్రెట్ ఏంటంటే..?

రూ. 30 కోట్ల ఖర్చుతో.. రూ. 500 కోట్ల సినిమాలా ఎలా తీశారు..? హనుమాన్ సీక్రెట్

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి టాక్ ఆఫ్ ది టౌన్‌ గా నిలుస్తోంది హనుమాన్ మూవీ. చిన్న బడ్జెట్ సినిమా.. రికార్డులు తిరగరాస్తుంది. అడుగడుగునా సమస్యలు ఎదురైనా.. ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా, విశ్వాసంతో ముందడుగు వేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు నాటే కాదు.. బీటౌన్ అటు విదేశాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టుకుంటోంది. తొలి రోజే రూ. 21 కోట్లకు పైగా కొల్లగొట్టిందీ చిత్రం. సుమారు మూడు నాలుగేళ్ల పాటు ప్రశాంత్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ లో భాగంగా వచ్చిన తొలి సినిమా ఇది. పురాతన ఇతిహాస గాధల్లోని సూపర్ హీరో హనుమంతుడి శక్తులను ఇప్పటి నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రశాంత్.

హనుమాన్ తక్కువ బడ్జెట్‌ లో రూపొందించినప్పటికీ..ఏ విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా తీయడంతో థ్రిల్ ఫీలవుతున్నారు ప్రేక్షకులు. కొన్ని సీన్లు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. ఇందులో ప్రతి ఫ్రేమ్ ఓ కళా ఖండం. ఇంతలా మూవీ సక్సెస్ అవ్వడం కారణం.. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్, గ్రాఫిక్స్. ఇవే సినిమాను ఎడ్జ్‌ లో కూర్చోపెట్టాయి. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో స్క్రీన్ పై కనబడుతోంది. ఇన్నాళ్లు ఈ మూవీ వాయిదా పడటానికి అతను చెబుతున్న కారణాలకు కాంప్రమైజ్ కాకుండా ఉండలేం. అంతలా మూవీని ఎలివేట్ చేశాడు గ్రాఫిక్స్, వీఎఎక్స్‌ లతో. అలా అని వీటి కోసం కోట్లను ఖర్చు పెట్టలేదు. పెట్టేంత బడ్జెట్ కూడా కాదు. కానీ కేవలం రూ. 30 కోట్లతో.. 500 కోట్ల రూపాయలు కొల్లగొట్టే వర్త్ సినిమాను అందించాడు.

వీఎఫ్ఎక్స్ కోసం అంతర్జాతీయ సంస్థలతో వర్క్ చేయిస్తున్నాడని అనుకున్నారంతా..కానీ అతను కేవలం స్టార్టప్ కంపెనీలతో టై-అప్ అయ్యి వర్క్ చేయించుకున్నాడు. హనుమాన్ మూవీ కోసం ఎలాంటి టెక్నాలజీని వినియోగించాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. తమలాగే ఫ్రూవ్ చేసుకోవాలనే వ్యక్తులతో టీం బిల్డ్ చేసుకుని..మాకున్న బడ్జెట్‌ లో సీజీ, వీఎఫ్ఎక్స్ పూర్తి చేయడానికి, క్వాలిటీ ఇవ్వడానికి ఇంత టైం పట్టిందంటూ చెప్పాడు. అలాగే ఇప్పుడు అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్టిఫిసియల్ ఇంటెలిజెంట్, చాట్ జీపీటీ, మిడ్ జర్నీ వంటి వాటిని వాడి ఎఫెక్టివ్ వర్క్ చేయించుకున్నారట. పోస్టర్స్ దగ్గర నుండి మ్యూజిక్ విషయంలో కూడా ఈ ఆధునిక సాంకేతికతను వినియోగించారు. ఇదే ఈ మూవీ సక్సెస్ వెనుక ఉన్న అసలు సిసలైన సీక్రెట్.

స్టారప్, చిన్న కంపెనీలతో వీఎఫెక్స్, సీజీ వర్క్ చేయించుకుని.. ఒక విజువల్ వండర్ ని క్రియేట్ చేశాడు ప్రశాంత్. సినిమాను ఇంత ప్రేమించాడు కాబట్టే..అంత లేట్ అయ్యిందని ఈ సినిమా గ్రాఫిక్ వర్క్ చూస్తూనే ఉంది. చిన్న వీఎఫ్ఎక్స్‌ల కోసం కోట్లను ఖర్చు పెడుతున్న ఈ కాలంలో.. ప్రశాంత్..తన బడ్జెట్‌ కు తగ్గట్లే ఎక్కడా వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకుండా పిక్చర్‌ ను అద్బుతంగా మలుచుకున్నాడు. తక్కువ బడ్జెట్‌ తో కూడా గ్రాఫిక్ వర్క్ ఓ రేంజ్‌లో చేసుకోవచ్చునని నిరూపించాడు. హాలీవుడ్ మూవీని తలదన్నేలా ఉన్న ఈ వీఎఫ్ఎక్స్‌ ను అందించింది హైదారాబాద్‌ కు చెందిన ‘హెలో హ్యూస్ స్టూడియోస్’ అని తెలుస్తోంది. మరి ఇంత తక్కువ బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్ అవుట్ పుట్ తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి