iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ పై ఫ్రెంచ్ హీరో ప్రశంసలు..!ఎందుకంటే..

  • Published Aug 16, 2024 | 11:51 AM Updated Updated Aug 16, 2024 | 11:51 AM

Ram Charan, Lucas Bravo: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయనపై ఓ ఫ్రెంచ్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే..

Ram Charan, Lucas Bravo: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజా ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయనపై ఓ ఫ్రెంచ్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. ఎందుకంటే..

  • Published Aug 16, 2024 | 11:51 AMUpdated Aug 16, 2024 | 11:51 AM
రామ్ చరణ్ పై ఫ్రెంచ్ హీరో ప్రశంసలు..!ఎందుకంటే..

సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల అభిమానులు వారికి సంబంధించిన వార్తలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే సమయంలో తమ అభిమానా హీరోకు సంబంధించి ఏదైనా అదిరిపోయే వార్త వస్తే మాత్రం ఎగిరిగి గంతేస్తారు. ఇది ఇలా ఉంటే తరచూ కొందరు సెలబ్రిటీలపై ప్రశంసల వర్షం కురుస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ పై ఏకంగా ఫ్రెంచ్ హీరో ప్రశంసల వర్షం కురిపించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఇండియన్ సినీ ఇండస్ట్రీని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేసింది. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పలువురు హాలీవుడ్ ప్రముఖులు గతంలో ఈ సినిమాపై, అందులోని నటీనటులపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావో..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ప్రశంసించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. దీంతో ఎక్స్ లో మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లోకి వచ్చింది.

ఇక ఫ్రెంచ్ హీరో లూకాస్ బ్రావ్ మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో రామ్‌ చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో సూపర్ గా నటించారు. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ రామ్ నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు’’ అని ఆయన ప్రశంసించారు. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’ సినిమా 2022లో విడుదలైంది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా దెబ్బకు అనేక సినిమాల రికార్డులు బద్దలయ్యాయి. భారత్ లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఎన్నో ఏళ్లుగా భారత సినీ పరిశ్రమకు అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ అవార్డును ఈ సినిమా ద్వారా లభించింది.

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం  ‘గేమ్ ఛేంజర్‌’తో  ఆయన బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌  స్టోరీతో ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో రామ్ చరణ్ డబుల్ రోల్ కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ కి జోడీగా కియారా అడ్వాణీ కనిపించనుంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌ చంద్ర వంటి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom