iDreamPost

Nani-Rana: నాని, రానా మధ్య వార్! ఇద్దరి మధ్య హిట్ గొడవ!

  • Published Jul 02, 2024 | 4:24 PMUpdated Jul 02, 2024 | 4:24 PM

యూత్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​లోనూ మంచి క్రేజ్ కలిగిన హీరోలుగా నాని, రానాను చెప్పొచ్చు. రొటీన్​కు భిన్నంగా ఉండే సినిమాల్లో నటించడం వీళ్లిద్దరికీ అలవాటు.

యూత్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​లోనూ మంచి క్రేజ్ కలిగిన హీరోలుగా నాని, రానాను చెప్పొచ్చు. రొటీన్​కు భిన్నంగా ఉండే సినిమాల్లో నటించడం వీళ్లిద్దరికీ అలవాటు.

  • Published Jul 02, 2024 | 4:24 PMUpdated Jul 02, 2024 | 4:24 PM
Nani-Rana: నాని, రానా మధ్య వార్! ఇద్దరి మధ్య హిట్ గొడవ!

యూత్​తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్​లోనూ మంచి క్రేజ్ కలిగిన హీరోలుగా నాని, రానాను చెప్పొచ్చు. రొటీన్​కు భిన్నంగా ఉండే సినిమాల్లో నటించడం వీళ్లిద్దరికీ అలవాటు. జోనర్ ఏదైనా తమ యాక్టింగ్​తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటారు. వీళ్లను స్క్రీన్ పై చూసేందుకు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఈ ఇద్దరు స్టార్ల మధ్య మంచి ఫ్రెండ్​షిప్ ఉంది. గతంలో కలసి ఓ అవార్డ్ ఫంక్షన్​కు హోస్ట్​లుగానూ అలరించారు. అలాంటోళ్ల మధ్య గొడవ అంటే అందరూ షాక్ అవుతున్నారు. ఈ ఇద్దరు హీరోల మధ్య వార్ మొదలవడం టాక్ ఆఫ్ ది టౌన్​ అయిపోయింది. అయితే టెన్షన్ పడాల్సిందేమీ లేదు.

నాని-రానా విడివిడిగా తెర మీద కనిపిస్తేనే అభిమానులు తట్టుకోలేరు. అలాంటిది ఈ స్టార్లు ఇద్దరూ కలసి సిల్వర్​స్క్రీన్ మీద సందడి చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అవును, ఇది నిజం కాబోతోంది. నాని-రానా కలసి స్క్రీన్​ను షేర్ చేసుకోనున్నారు. దీన్ని ‘హిట్’ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను నిజం చేయనున్నాడని తెలిసింది. టాలీవుడ్​లో బాగా ఫేమస్ అయిన ఫ్రాంచైజీల్లో ఒకటి ‘హిట్’. నాని నిర్మాణంలో, శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. ‘హిట్’లో యంగ్ హీరో విశ్వక్​సేన్ నటించగా.. ‘హిట్ 2’లో మరో యువ కథానాయకుడు అడివి శేష్ అలరించారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, చివరి వరకు కొనసాగే సస్పెన్స్ అంశాలతో ఈ థ్రిల్లర్స్ మంచి విజయాలు సాధించాయి. ‘హిట్ 2’ ఆఖర్లో నానీని చూపించి డైరెక్టర్ మెప్పించాడు. మూడో పార్ట్​కు ఆయనే హీరో అని రివీల్ చేశాడు. ఈ సిరీస్​లో మరిన్ని సినిమాలు ఉంటాయని శైలేష్ కొలను ఇప్పటికే ప్రకటించాడు. దీంతో థర్డ్ పార్ట్ అనౌన్స్​మెంట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ‘హిట్ 3’లో నాని-రానా కలసి యాక్ట్ చేయనున్నారని సమాచారం.

‘హిట్ 3’లో హీరోగా నాని, విలన్​గా రానా కనిపించడం దాదాపుగా కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. ఇద్దరి మధ్య స్క్రీన్​పై ఫైట్ తప్పదట. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన పూర్తి కథను శైలేష్ రెడీ చేశాడని.. దానికి నాని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని టాలీవుడ్ సర్కిల్స్​లో వినిపిస్తోంది. రానాతోనూ స్టోరీ సిట్టింగ్స్ జరిగాయని.. నానితో కలసి నటించేందుకు ఆయన ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే మూవీ టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చే వరకు ఆగాలి. ఇక, సైకోలను పట్టుకునేందుకు హీరో రంగంలోకి దిగడం.. ఒక్కో ఫజిల్​ను దాటుకుంటూ కేసును సాల్వ్ చేయడం ‘హిట్’ సిరీస్​ కథ. ఈ ఫార్మాట్ ప్రకారం చూస్తే మూడో పార్ట్​లో రానా సైకో కిల్లర్​గా యాక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి.. నాని-రానాను తెర మీద చూసేందుకు మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి