P Venkatesh
హీరో విజయ్ నటించిన లియో మూవీ విజయవంతంగా దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో 100 పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
హీరో విజయ్ నటించిన లియో మూవీ విజయవంతంగా దూసుకెళ్తోంది. రికార్డు కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో 100 పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
P Venkatesh
కోలీవుడ్ టాప్ హీరో దళపతి విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో వేరే చెప్పక్కర్లేదు. విజయ్ సినిమా కోసం, వాటి అప్ డేట్ ల కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ప్రయోగాత్మక పాత్రలు, వైవిధ్యమైన రోల్స్ పోషిస్తూ విజయ్ న్యూ ట్రెండ్ సెట్ చేశారు. విజయ్ సినిమా విడుదలవుతుందంటే ఫ్యాన్స్ కు పెద్ద పండగే. ఇటీవల లియోతో వచ్చిన విజయ్ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టారు. సినిమా పాజిటీవ్ టాక్ సొంతం చేసుకోగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఓ వైపు మూవీ ప్రదర్శించబడుతుండగానే మళ్లీ రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారట. దాదాపు 100 థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.
సాధారణంగా ఓ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారంటే హీరో బర్త్ డే సందర్బంగానో లేదా సినిమా విడుదలై 10 లేదా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటేనో మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తుంటారు. కానీ తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో మాత్రం విడుదలై నెల కాక ముందే మళ్లీ రీ రిలీజ్ కు సిద్ధమవుతోందట. విక్రం ఫేమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజన్ తెరకెక్కించిన లియో అక్టోబర్ 19న విడుదలైంది. రిలీజైన నాటి నుంచే హౌస్ ఫుల్ కలెక్షన్లతో కనక వర్షం కురిపించిది. ఇప్పటికీ ఈ సినిమా 600 కోట్లుకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా 100 థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి గల కారణం ఇటీవల విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీలా పడడంతో లియోను మళ్లీ విడుదల చేయాలని భావిస్తున్నారట. త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో లియో విడుదల కానున్న నేపథ్యంలో రీ రిలీజ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో హీరో విజయ్ కోలీవుడ్ ను ఏలేస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. మామూలుగా విజయ్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇలాంటి తరుణంలో సినిమా విడుదలై నెల గడవక ముందే రీ రిలీజ్ చేయడం సినీ చరిత్రలో ఇదే మొదటిసారి కావొచ్చని సినిమా వర్గాలు చర్చించుకుంటున్నాయి. కాగా త్రిష, సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన లియోను ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.