P Krishna
AI Technology: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, అందాల భామ మీనాక్షి చౌదరి జంటగా.. వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ది గోట్’ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
AI Technology: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, అందాల భామ మీనాక్షి చౌదరి జంటగా.. వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ది గోట్’ మూవీ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
P Krishna
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సూపర్‌స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన హీరో విజయ్. ఈయన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద సందడి నెలకొంటుంది. తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ ‘లియో’ మూవీతో బాక్సాఫీస్ షేక్ చేశాడు. తాజాగా వెంటక ప్రభు దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీ గురువారం (సెప్టెంబర్ 5) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకు ముందుకు వచ్చింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్ నుంచి ట్రైలర్ వరకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. విజయ్ తో పాటు ఈ మూవీలో స్టార్ మరికొంతమంది అగ్ర తారలు నటించారు.
విజయ్ దళపతి నటించిన‘ది గోట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయంటూ మూవీ మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ది గోట్ మూవీలో దళపతి విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించాడు. ఒక పాత్ర యంగ్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే ఏఐ టెక్నాలజీతో దివంగత నటుడు విజయ్‌కాంత్ కనిపించడం. తెరపై విజయ్ కాంత్ కనిపించగానే థియేటర్లలో విజిల్స్, చప్పట్లతో మారుమోపోయింది. తమ అభిమాన హీరో మళ్లీ తెరపై కనిపించడంతో ఫ్యాన్స్ ఎమోషన్ అయినట్లు తెలుస్తుంది. విజయ్ కాంత్ ని అభిమానులు కెప్టెన్ అని పిలుస్తారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి దళపతి విజయ్ కి.. విజయ్ కాంత్ అంటే ఎంతో అభిమానం. గత ఏడాది డిసెంబర్ 28న అనారోగ్యం కారణంగా ఆయన కన్నుమూశారు.
సినిమాల్లో మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ‘నేషనల్ ప్రొగ్రెసీవ్ ద్రవిడ కజకం’ అనే పార్టీ స్థాపించారు. విజయ్ కాంత్ మరణం తమిళనాట అభిమానులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. తాజాగా దళపతి విజయ్ నటించిన ‘ది గోట్’ మూవీలో ఏఐ టెక్నాలజీతో విజయ్ కాంత్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇందు కోసం చిత్ర యూనిట్ ముఖ్యంగా డైరెక్టర్ వెంకట ప్రభు స్వయంగా విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత విజయ్ కాంత్‌ను సంప్రదించి ఆమె పరిమిషన్ తీసుకున్నారు. విజయ్ కాంత్ ని వెండితెరపై మళ్లీ చూడగానే అభిమానులు అద్భుతమైన అనుభూతి పొందినట్లుగా తెలుస్తుంది.. ఆ సీన్లు చూసి ఫుల్ ఖుషీ అయినట్లు తెలుస్తుంది. ‘వీ మిస్ యూ కెప్టెన్’ అంటూ ఆయనకు నివాళులర్పించారు. మొత్తానికి ఏఐ టెక్నాలజీతో ఇప్పుడు వెండి తెరపై ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అలనాటి హీరోలను మళ్లీ వెండి తెరపై చూస్తున్న అభిమానుల ఎంతగా ఎమోషన్ అవుతారో ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది.
After a long period ” CAPTAIN VIJAYAKANTH” in Screen by AI technology.#GOAT@PremallathaDmdk@actorvijay@captainnewstv pic.twitter.com/4k8FYssaYD
— Prabhakaran (@sprabhakaran792) September 5, 2024