iDreamPost
android-app
ios-app

Celebritie Taxpayer List: దేశంలో అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్న సెలబ్రిటీలు వీళ్లే! టాలీవుడ్ నుంచి..

  • Published Sep 05, 2024 | 3:37 PM Updated Updated Sep 05, 2024 | 3:37 PM

Highest Taxpayer Celebrities List 2023-24: ఫ్యార్చ్యూన్ ఇండియా దేశంలోనే 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. టాప్ 20 లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Highest Taxpayer Celebrities List 2023-24: ఫ్యార్చ్యూన్ ఇండియా దేశంలోనే 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. టాప్ 20 లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం.

Celebritie Taxpayer List: దేశంలో అత్యధికంగా ట్యాక్స్ పే చేస్తున్న సెలబ్రిటీలు వీళ్లే! టాలీవుడ్ నుంచి..

2023-24 సంవత్సరానికి సంబంధించి ఫార్చ్యూన్ ఇండియా దేశంలో అత్యధికంగా పన్ను(ట్యాక్స్) కట్టిన సెలబ్రిటీల లిస్ట్ ను తాజాగా వెల్లడించింది. ఇక సెలబ్రిటీలు తమ రంగాలతో పాటుగా ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టి.. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన హీరోలు ఒకవైపు సినిమాలు చేసుకుంటునే.. మరోవైపు ఇతర బిజినెస్ ల్లోకి ప్రవేశిస్తున్నారు. అలా కోట్లకు కోట్లు సంపాదిస్తూ.. అదే రేంజ్ లో దేశానికి పన్నులు కూడా కడుతున్నారు. మరి 2023-24 సంవత్సరానికి ఎవరెవరు ఎంత పన్ను కట్టారు? ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఫ్యార్చ్యూన్ ఇండియా దేశంలోనే 2023-24 సంవత్సరానికి సంబంధించి అత్యధికంగా పన్ను కట్టిన సెలబ్రిటీల లిస్ట్ ను తాజాగా విడుదల చేసింది. టాప్ 20లో టాలీవుడ్ నుంచి స్థానం సంపాదించుకున్న ఏకైక హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ బాద్ షా అగ్రస్థానంలో ఉన్నాడు. షారుఖ్ ఖాన్ అత్యధికంగా రూ. 92 కోట్ల ట్యాక్స్ ను పే చేశాడు. ఆ తర్వాత ప్లేస్ లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఉన్నాడు. ఇతడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 80 కోట్లను పన్ను రూపంలో చెల్లించాడు. రూ. 75 కోట్లతో కండల వీరుడు సల్మాన్ ఖాన్, రూ. 71 కోట్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ తర్వాత స్థానాల్లో ఉండగా.. టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ రూ. 66 కోట్లు చెల్లిస్తూ.. 5వ స్థానంలో ఉన్నాడు. క్రిికెటర్ల లిస్ట్ లో కోహ్లీదే తొలి ప్లేస్ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్ లో రూ. 14 కోట్లతో టాలీవుడ్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక్కడే టాప్ 20లో చోటు దక్కించుకున్నాడు.

కాగా.. తమ తమ రంగాల్లో కోట్లకు కోట్లను సంపాదిస్తూ.. లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు సెలబ్రిటీలు. సినిమా ఇండస్ట్రీలో హీరోలు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వాటితో పాటుగా యాడ్స్, ఇతర బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ.. డబ్బులు పోగేసుకుంటున్నారు. సంపాదనలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్నారు. అలాగే ట్యాక్స్ పేయింగ్ లోనూ వీళ్లు ముందున్నారు. సంవత్సరానికి ఏకంగా కోట్ల రూపాయాలను పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. మరి 2023-24 సంవత్సరానికి గాను అత్యధికంగా ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల వివరాలు తెలుసుకుందాం.

2023-24లో ఎక్కువ ట్యాక్స్ కట్టిన టాప్ 20 సెలబ్రిటీలు వీళ్లే

  • షారుక్‌ ఖాన్‌ : రూ.92 కోట్లు
  • దళపతి విజయ్‌ : రూ.80 కోట్లు
  • సల్మాన్‌ ఖాన్‌ : రూ.75 కోట్లు
  • అమితాబ్‌ బచ్చన్‌ : రూ. 71 కోట్లు
  • విరాట్‌ కోహ్లీ : రూ.66 కోట్లు
  • అజయ్‌ దేవగణ్‌ : రూ. 42 కోట్లు
  • ఎంఎస్‌ ధోనీ : రూ.38 కోట్లు
  • రణ్‌బీర్‌ కపూర్‌ : రూ.36 కోట్లు
  • హృతిక్‌ రోషణ్ : రూ.28 కోట్లు
  • సచిన్‌ టెండూల్కర్‌ : రూ.28 కోట్లు
  • కపిల్‌ శర్మ : రూ.26 కోట్లు
  • సౌరవ్‌ గంగూలీ : రూ.23 కోట్లు
  • కరీనా కపూర్‌ : రూ.20 కోట్లు
  • షాహిద్‌ కపూర్‌ : రూ.14 కోట్లు
  • మోహన్‌ లాల్‌ : రూ.14 కోట్లు
  • అల్లు అర్జున్‌ : రూ.14 కోట్లు
  • హార్దిక్‌ పాండ్యా : రూ.13 కోట్లు
  • కియారా అడ్వాణీ : రూ.12 కోట్లు
  • కత్రినా కైఫ్‌ : రూ.11 కోట్లు
  • పంకజ్‌ త్రిపాఠి : రూ.11 కోట్లు
  • ఆమిర్‌ ఖాన్‌ : రూ. 10 కోట్లు
  • రిషబ్‌ పంత్‌ : రూ.10 కోట్లు