iDreamPost
android-app
ios-app

Venkat Prabhu: GOAT మూవీ తీసి.. నిజంగానే గొర్రెలా ప్రవర్తిస్తున్న వెంకట్ ప్రభు! ఇవేమి పిచ్చి మాటలు

  • Published Sep 11, 2024 | 10:44 AM Updated Updated Sep 11, 2024 | 10:44 AM

Netizens Fire On Director Venkat Prabhu: ది గోట్ మూవీలో సీఎస్కే రిఫరెన్స్ ఉండటంతో.. తెలుగు, హిందీలో సినిమా బాగా ఆడలేదని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Netizens Fire On Director Venkat Prabhu: ది గోట్ మూవీలో సీఎస్కే రిఫరెన్స్ ఉండటంతో.. తెలుగు, హిందీలో సినిమా బాగా ఆడలేదని కాంట్రవర్సీ కామెంట్స్ చేశాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Venkat Prabhu: GOAT మూవీ తీసి.. నిజంగానే గొర్రెలా ప్రవర్తిస్తున్న వెంకట్ ప్రభు! ఇవేమి పిచ్చి మాటలు

దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోట్’. స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది. అయితే తొలి రోజు నుంచే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్ లో మాత్రం డీసెంట్ టాక్ ను రాబట్టగా.. తెలుగుతో సహా ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు విజయ్. అయితే వసూళ్ల పరంగా మాత్రం గోట్ దూసుకెళ్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. కానీ.. సినిమాపై మాత్రం నెగటివిటీ వచ్చింది. ఇక ఈ వ్యతిరేకతపై డైరెక్టర్ వెంకట్ ప్రభు స్పందించిన విషయం తెలిసిందే. ఇక ఆయన మాటలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవేం పిచ్చి మాటలు అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు.

“ది గోట్ మూవీలో చెన్నై సూపర్ కింగ్స్ రిఫరెన్స్ తీసుకోవడం మూలంగా ఈ సినిమా తెలుగు, హిందీలో సరిగ్గా ఆడదని నేను ముందే గ్రహించాను. కేవలం సీఎస్కే రిఫరెన్స్ ఉండటంచేత వారు నా మూవీ చూడట్లేదు. ఇక నేను స్వతహాగా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని కాబట్టి.. నన్ను ఎప్పుడూ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్ ట్రోల్, విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంలో నేను ఏమీ చేయలేను” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వెంకట్ ప్రభు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఈ స్టార్ డైరెక్టర్ పై మూవీ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడటం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.

కాగా.. ది గోట్ మూవీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని హైలెట్ చేయడంతోనే తెలుగులో ఈ సినిమా సరిగ్గా ఆడలేదన్న డైరెక్టర్ వెంకట్ ప్రభు వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మీరు సరిగ్గా సినిమా తీయకుండా.. ప్రేక్షకులను ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు నిజంగానే ది గోట్.. గొర్రె సినిమా తీసి.. గొర్రెలాగే ఆలోచిస్తున్నారు అంటూ తిట్టిపోస్తున్నారు. ఓ స్టార్ డైరెక్టర్ స్థాయిలో మీరు ఉండి.. ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంత వరకు కరెక్టో మీకే తెలియాలి అంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. ఇక సినిమాల్లో చాలా రిఫరెన్స్ లు వాడుతూ ఉంటారు.. వాటి మూలంగానే సినిమా ఆడలేదని, ప్రేక్షకులు చూడటం లేదని అనడం కరెక్ట్ కాదు, ఇలాంటి ఆలోచనా ధోరణి తగదు అంటూ ప్రేక్షకులు వెంకట్ ప్రభుకు సూచిస్తున్నారు. మరి వెంకట్ ప్రభు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.